తెలుగులో మంచి ప్రజాదరణ కలిగిన సీరియల్ ‘ఎన్నెన్నో జన్మల బంధం’. ఈ సీరియల్ లో యశ్ కి మొదటి భార్యగా మాళవిక మంచి నటన కనబర్చుతున్నది. అందంతో పాటు అభినయంతో టీవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ మాళవిక అసలు పేరు హీనా రాయ్. బుల్లితెరపై అడుగు పెట్టక ముందు మోడల్ గా రాణించింది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ తో కలిసి పలు ఫ్యాషన్ షోలలో పాల్గొన్నది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. పలు యాడ్స్ లోనూ హీనా రాయ్ యాక్ట్ చేసింది. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపైనా దర్శనం ఇస్తున్నది. Photos Credit: Heena Rai/Instagram