Shine Tom Chacko: గర్ల్‌ఫ్రెండ్‌తో ‘దసరా’ నటుడి ఎంగేజ్‌మెంట్ - సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Shine Tom Chacko Engagement: ‘దసరా’లో విలన్‌గా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన షైన్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Shine Tom Chacko : గత కొంతకాలంగా మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. తనూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి షైన్ ముందుకు రాకపోయినా.. వీరి సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే ఈ ఇద్దరి రిలేషన్‌షిప్‌పై నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ షైన్, తనూజ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబాలు, కొందరు సన్నిహితులు మధ్య జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. న్యూ ఇయర్ రోజే వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఆ రోజును మరింత స్పెషల్‌గా మార్చుకున్నారు.
మూవీ ప్రమోషన్స్‌లో ఎంగేజ్‌మెంట్ అనౌన్స్‌మెంట్..
మాలీవుడ్‌లో షైన్ టాక్ చాకో ఇప్పటికే ఒక వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తనకు కాబోయే భార్య తనూజ కూడా ఫ్యాషన్ ఇండస్ట్రీలో మోడల్‌గా పనిచేస్తోంది. వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్‌లో చాలా సింపుల్ లుక్స్‌తో కనిపించడం చాలామంది ఆకట్టుకుంది. ఒక పింక్ కలర్ షర్ట్‌లో షైన్, వైట్ గౌన్‌లో తనూజ.. చాలా క్యూట్‌గా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరూ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా ఎప్పుడూ బయటపెట్టకపోయినా.. షైన్ నటించిన దాదాపు ప్రతీ సినిమా ప్రమోషన్‌కు తనూజ కూడా వచ్చేది. ఇక 2023 నవంబర్ 7న షైన్ షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్.. వీరి రిలేషన్‌పై అందరి దృష్టి పడేలా చేసింది. గతేడాది షైన్ నటించిన ‘డ్యాన్స్ పార్టీ’ మూవీ ప్రమోషన్స్ సమయంలో త్వరలోనే వీరి ఎంగేజ్‌మెంట్ జరగనుందని హింట్ ఇచ్చేశాడు కూడా.
View this post on Instagram
‘దసరా’తో తెలుగు డెబ్యూ..
మలయాళంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో.. తెలుగులో కూడా డెబ్యూ ఇచ్చాడు. గతేడాది నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమాలో చిన్న నంబి పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో షైన్‌కు తెలుగులో కూడా అవకాశాలు పెరిగాయి. పదేళ్లకు పైగా మాలీవుడ్‌లో ఉంటూ.. ఎన్నో గుర్తుండిపోయే రోల్స్ చేసిన షైన్‌కు ఇప్పుడిప్పుడే టాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ‘దసరా’లో ఈ నటుడి పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయిన దర్శకుడు కొరటాల శివ.. తనకు ‘దేవర’లో కూడా అవకాశం ఇచ్చాడు. ఎన్‌టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’లో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. షైన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
దాదాపు అరడజను సినిమాలు..
‘దేవర’తో పాటు షైన్ టాక్ చాకో చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ 2024లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఆన్ స్క్రీన్‌పై మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న షైన్.. తన ఆఫ్ స్క్రీన్ ప్రవర్తనతో పలుమార్లు ఇబ్బందుల్లో పడ్డాడు. మూవీ ప్రమోషన్స్ సమయంలో మీడియా అడిగే ప్రశ్నలు తనకు నచ్చకపోయినా.. తనను ఇబ్బందిపెట్టినా వారి మీద ఫైర్ అవ్వడానికి ఏ మాత్రం ఆలోచించడు షైన్. ఇప్పటికీ అలా పలుమార్లు జరిగింది. అంతే కాకుండా నాకు నచ్చినట్టే ఉంటా అనే యాటిట్యూడ్‌తో పలుమార్లు ఇంటర్వ్యూలలో పాల్గొనడంతో సోషల్ మీడియాలో షైన్ గురించి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. 2019లో ‘ఇష్క్’ అనే మలయాళ చిత్రానికి ‘బెస్ట్ నెగిటివ్ రోల్’లో అవార్డ్ కూడా అందుకున్నాడు షైన్ టామ్ చాకో.
Also Read: మహేశ్, రాజమౌళి సినిమాపై కీలక అప్డేట్ - ఈ మూవీ కూడా రెండు భాగాలేనా? ఇదిగో క్లారిటీ!