అన్వేషించండి

Mahesh Rajamouli Movie: మహేశ్, రాజమౌళి సినిమాపై కీలక అప్డేట్ - ఈ మూవీ కూడా రెండు భాగాలేనా? ఇదిగో క్లారిటీ!

Mahesh Babu: మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే ప్రేక్షకుల్లో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు అప్డేట్స్ బయటికి వచ్చాయి.

Mahesh Babu Rajamouli Movie Update: ‘ఆర్ఆర్ఆర్’లాంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన తర్వాత రాజమౌళి తరువాతి స్టెప్ ఏంటి అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబులాంటి స్టార్‌తో మూవీ ఉంటుందని ప్రకటించడంతో ఈ కాంబినేషన్‌పై అందరిలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం మహేశ్.. ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో రాజమౌళి కూడా కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాజమౌళి, మహేశ్ మూవీకి సంబంధించి పలు రూమర్స్.. సినీ సర్కిల్లో వైరల్ అవ్వగా.. తాజాగా వైరల్ అవుతున్న ఒక అప్డేట్ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది.

మొదటిసారి అంత బడ్జెట్..
మహేశ్ బాబు, రాజమౌళి సినిమాను అనౌన్స్ చేసి చాలాకాలం అవ్వడంతో అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మరికొన్ని రూమర్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీకి రూ.1000 కోట్ల బడ్జెట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రం కూడా అంత బడ్జెట్‌తో తెరకెక్కలేదని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే మొదటినుండి బడ్జెట్ విషయంలో రిస్కులు తీసుకోవడం రాజమౌళికి అలవాటే. ఒక తెలుగు సినిమా రూ.100 కోట్లను కలెక్ట్ చేయడం కష్టమని ఇండస్ట్రీ నిపుణులు సైతం భావిస్తున్న రోజుల్లోనే ఆ రేంజ్ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించడం మొదలుపెట్టాడు రాజమౌళి.

జనవరి చివరి నుండే..
ఇక మహేశ్ కోసం పూర్తిస్థాయి కథ సిద్ధమయిన తర్వాత షూటింగ్ ప్రారంభించే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి.. మూవీకి సంబంధించిన విశేషాలను అందరితో పంచుకోనున్నాడట రాజమౌళి. తన ముందు సినిమాలకు కూడా దర్శక ధీరుడు ఇదే ఫార్మాట్‌ను ఫాలో అయ్యాడు. ఇక జనవరిలో ‘గుంటూరు కారం’ విడుదలవుతుంది కాబట్టి జనవరి చివరి వారం వరకు స్క్రిప్ట్‌ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించాలని మూవీ టీమ్ భావిస్తుందని సమాచారం. ఇక ఈ మూవీకి రైటర్‌గా పనిచేస్తున్న విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మహేశ్‌తో తెరకెక్కించనున్న సినిమాతో ఇప్పటివరకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరిస్తాడని ఆయన బయటపెట్టారు.

సీక్వెల్ ఉంటుందా..?
మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీ ప్రపంచాన్ని చుట్టేసే వ్యక్తి కథ అని ఇప్పటికే దర్శకుడు హింట్ ఇచ్చాడు. అయితే ఈ కథ అమెజాన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు. ఈ కథలో ఫారిన్ నటీనటులు కూడా కనిపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీలో నటించే ఫారిన్ నటీనటులు వీరే అంటూ పలువురి పేర్లు బయటికి వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల అవుతుందా అని ప్రశ్నించగా.. సీక్వెల్‌కు అవకాశం ఉండేలా సినిమా ముగుస్తుందని రివీల్ చేశారు విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్‌ను ఇప్పటికే ఫైనల్ చేయగా.. అక్కడ షూటింగ్ చేయడానికి అనుమతుల కోసం మూవీ టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో - అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Embed widget