Samantha on Twitter: ఆ రెండిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తా - సమంత
ట్విట్టర్‌లో నెటిజనులు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇచ్చారు. అందులో ఆమె ఏం చెప్పారు? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
సమంత ఒక కథానాయికగా నటించిన సినిమా 'కన్మణి రాంబో ఖతీజా' (తమిళ సినిమా 'కాతువాకుళే రెండు కాదల్'కు తెలుగు అనువాదం). ఇందులో విజయ్ సేతుపతి హీరో. నయనతార మరొక కథానాయిక. గురువారం సినిమా విడుదల అయ్యింది. ఆ రోజే ఆమె పుట్టినరోజు కూడా! అప్పుడు సమంత సౌతిండియాలో లేరు. విజయ్ దేవరకొండకు జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్ళారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ముచ్చటించారు. ఆ సంగతులివి...
అనిరుద్ గురించి చెప్పండి? మీ సినిమాలకు ఆయన సంగీతం అందించిన ప్రతిసారి ఆయన ఎలా ఫీల్ అవుతారు?
అనిరుద్ చాలా స్పెషల్. అతనొక జీనియస్
'కన్మణి రాంబో ఖతీజా'లో మీ ఫేవరెట్ సాంగ్?
డిప్పమ్ డిప్పమ్.
సేమ్ టైమ్‌లో ప్రేక్షకుల నుంచి ప్రేమ, విపరీతమైన ద్వేషం రావడం ఎలా అనిపిస్తోంది?
ఆ రెండిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ప్రేమలోనూ, ద్వేషంలోనూ మునగాలని ప్రయత్నించను.
ఖతీజా పాత్ర గురించి...
ప్రేక్షకుల ముఖం మీద చిరునవ్వు పూయించే సినిమాల్లో నేను ఒక భాగం కావాలని అనుకున్నాను. రోజువారీ సమస్యల నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ప్రేక్షకులు కొంచెం నవ్వాలి. 'కన్మణి రాంబో ఖతీజా' (Kanmani Rambo Khatija / Kathuvakula Rendu Kadhal) నాకు అటువంటి చిత్రమే.
నయనతార గురించి కొన్ని మాటలు...
నయనతార అంటే నయనతార. ఆమెలా మరొకరు ఉండరు. షి ఈజ్ రియల్. ఆమెలో ఒక ఫైర్ ఉంటుంది, నిజాయతీ ఉంటుంది. నేను కలిసిన వ్యక్తుల్లో బాగా కష్టపడి పనిచేసే వ్యక్తుల్లో ఆమె ఒకరు.
చెన్నైలో KRK movie ఫస్ట్ డే ఫస్ట్ షో, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను మీరు మిస్ అయ్యారు. త్వరగా కశ్మీర్ నుంచి తిరిగొచ్చి ప్రేక్షకులపై ఖతీజా ప్రభావం ఎంత ఉందనేది మీరు చూస్తారని ఆశిస్తున్నా
మీరు చూపిస్తున్న ప్రేమకు నిజంగా ధన్యురాలిని. ఖతీజా పాత్రకు లభిస్తున్న ఆదరణ నాకు నిజమైన పుట్టినరోజు బహుమతి.
Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
మీ శత్రువు హృదయంలోకి తొంగి చూసినప్పుడు మీరు ఏం తెలుసుకుంటారు?
డిఫరెంట్ పర్‌స్పెక్టివ్. నా గురించి వేరే కోణం చూస్తా.
Also Read: కొరటాలతో ఎన్టీఆర్ సినిమాపై 'ఆచార్య' ఎఫెక్ట్? ఆందోళనలో యంగ్ టైగర్ ఫ్యాన్స్??
My team ♥️
— Samantha (@Samanthaprabhu2) April 29, 2022
Stylist - Preetham jukalker
Makeup -Sadhna Singh
Hair - Amar#AskSam#KaathuvakulaRenduKaadhal https://t.co/rLYkEHzfMv