Acharya Effect On NTR 30: కొరటాలతో ఎన్టీఆర్ సినిమాపై 'ఆచార్య' ఎఫెక్ట్? ఆందోళనలో యంగ్ టైగర్ ఫ్యాన్స్??

'ఆచార్య' ఫలితంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉంటే, యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారా? ఎందుకంటే... కొరటాల శివ తర్వాత సినిమా ఎన్టీఆర్‌తోనే కదా!

FOLLOW US: 

'ఆచార్య' (Acharya) మూవీ విడుదల అయ్యింది. మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆశించిన రిజల్ట్ అయితే రాలేదు. విమర్శకుల నుంచి నెగెటివ్ కామెంట్స్, రివ్యూస్ ఎక్కువ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుంది? ఫైనల్ రన్‌లో 'ఆచార్య' ఎంత కలెక్ట్ చేస్తుంది? అనేది ఈ రోజే చెప్పడం కష్టం. కొన్నిసార్లు ఫ్యాన్స్ వల్ల ప్లాప్ సినిమాలకు కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తాయి. 

మెగా ఫ్యామిలీ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా 'ఆచార్య' సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. 
'ఆచార్య' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ ఒక సినిమా చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కూడా అదే. ఆ సినిమాపై 'ఆచార్య' రిజల్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందనేది ఒక టాక్. 

'ఆచార్య' రిజల్ట్ చూశాక... రాజమౌళి సినిమాతో హిట్ అందుకున్న హీరోకి, ఆ తర్వాత పక్కా ప్లాప్ వస్తుందనే సెంటిమెంట్ ఉండనే ఉంది. 'ఆచార్య'తో ఆల్రెడీ అది ప్రూవ్ అయ్యిందని, ఎన్టీఆర్ 30 (NTR 30) తో కూడా ప్రూవ్ అవుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారా? అంటే... 'లేదు' అని చెప్పాలి.

Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

సోషల్ మీడియాలో కొరటాల శివకు అండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 'వన్ నేనొక్కడినే' తర్వాత 'నాన్నకు ప్రేమతో' సినిమాతో సుకుమార్‌కు, 'సర్దార్ గబ్బర్ సింగ్' తర్వాత 'జై లవ కుశ'తో కె.ఎస్. రవీంద్ర (బాబీ)కు, 'అజ్ఞాతవాసి' తర్వాత 'అరవింద సమేత వీరరాఘవ'తో త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఎన్టీఆర్ అవకాశాలు మాత్రమే కాదు, హిట్ సినిమాలకు ఇచ్చారని... 'ఆచార్య' తర్వాత ఎన్టీఆర్ 30తో కొరటాల శివకు హిట్ ఇస్తారని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో రిపేర్స్ చేస్తాడని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. 'ఆచార్య' విడుదల తర్వాత ఎన్టీఆర్ 30 ట్రెండింగ్‌లోకి రావడం విశేషం.

Also Read: తండ్రి మరణం - హీరో నిఖిల్ ఎమోషనల్ పోస్ట్

Published at : 29 Apr 2022 02:38 PM (IST) Tags: ntr Koratala siva NTR 30 Acharya Effect On NTR 30 NTR Kortala Siva Movie Update

సంబంధిత కథనాలు

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

Mla Balakrishna :  ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!