IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Acharya Movie Review - 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Chiranjeevi, Ram Charan's Acharya Movie Review: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించిన 'ఆచార్య' నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 

సినిమా రివ్యూ: ఆచార్య
రేటింగ్: 2/5
నటీనటులు: చిరంజీవి, రామ్ చరణ్, సోనూ సూద్, పూజా హెగ్డే, జిష్షు సేన్ గుప్తా, తనికెళ్ళ భరణి, అజయ్, తదితరులతో ప్రత్యేక గీతాల్లో రెజీనా, సంగీత & అతిథి పాత్రలో సత్య 
సినిమాటోగ్రఫీ: తిరు
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 
రచన, దర్శకత్వం: కొరటాల శివ
విడుదల తేదీ: ఏప్రిల్ 29, 2022 

Acharya Review: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన తొలి సినిమా 'ఆచార్య'. తండ్రి తనయులు ఇద్దరు ఎలా చేశారనే ఆసక్తికి‌ తోడు 'ఆర్ఆర్ఆర్' విజయం తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఉత్తరాది ప్రేక్షకులు సైతం 'ఆచార్య' కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. మరి, సినిమా ఎలా ఉంది? ఏమిటి?

కథ: ధర్మస్థలి అంటే ధర్మానికి పెట్టింది పేరు. అదొక టెంపుల్ టౌన్.‌ అయితే, బసవ (సోనూ సూద్) అరాచకాలతో ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంది. అటువంటి తరుణంలో అక్కడికి ఆచార్య (చిరంజీవి) వస్తాడు. అతడొక కామ్రేడ్. ఒక దళానికి నాయకుడు. అడవిలో ఉండే అన్న ప్రజల మధ్యకు ఎందుకు వచ్చాడు? పాద ఘట్టం ప్రజలకు ఎందుకు అండగా నిలబడ్డాడు? పాద ఘట్టం లో పెరిగిన... ధర్మస్థలిలో ధర్మ స్థాపనకు కృషి చేసిన సిద్ధ (రామ్ చరణ్), ఆచార్య మధ్య సంబంధం ఏమిటి? మధ్యలో రాథోడ్ (జిష్షు సేన్ గుప్తా) ఎవరు? ధర్మస్థలికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆచార్య ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: చిరంజీవి సినిమా అంటే అభిమానులు, ప్రేక్షకులు మెగా మూమెంట్స్ ఆశిస్తారు. అందులోనూ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు అనేసరికి... అంచనాలు చాలా పెరిగాయి.‌ దర్శకుడు కొరటాల శివ ఇప్పటివరకు తీసిన చిత్రాలు అన్ని విజయాలు సాధించాయి. ఆయనది ప్రత్యేక శైలి.‌ వాణిజ్య హంగులతో, వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రాలు తీశారు. మెగా ఇమేజ్ కు కొరటాల శివ కథ, దర్శకత్వం తోడైతే... భారీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. సినిమా ఎలా ఉందా? అంటే... లేదని చెప్పాలి. భారీ బ్లాక్ బస్టర్ కాదు... కనీసం కామన్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో సినిమా ఫెయిల్ అయ్యింది.

సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథ ఏమిటి? అని ఆలోచిస్తే... పెద్దగా ఏమీ గుర్తు రాదు. దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ కూడా కనిపించలేదు. కథ, కథనం రొటీన్ గా ఉన్నాయి. తెరపై జరిగే సన్నివేశాలతో ఆడియన్స్ ఎక్కడా ఎమోషనల్ గా కనెక్ట్ కావడం కష్టం. అలాగని, మెగా మోమెంట్స్ లేవు అని కాదు. కొన్ని ఉన్నాయి. కొరటాల శివ నుంచి ఇంత వీక్ స్క్రిప్ట్, వీక్ క్యారెక్టరైజేషన్, వీక్ సీన్స్ కామన్ ఆడియన్ కూడా ఆశించి ఉండరు. 

చిరంజీవి, రామ్ చరణ్ మీద తెరకెక్కించిన 'బంజారా బంజారా...' సాంగ్ ఆడియో పరంగా అంత హిట్ కాలేదు. కానీ, స్క్రీన్ మీద చూసినప్పుడు బావుంది. ముఖ్యంగా తండ్రీ తనయుల కెమిస్ట్రీ అదిరిపోయింది. అదొక్కటే కాదు... మిగతా సాంగ్స్ కూడా స్క్రీన్ మీద పర్వాలేదు. రామ్ చరణ్, పూజా హెగ్డేపై తెరకెక్కించిన నీలాంబరి సాంగ్, రెజీనా చేసిన ఐటమ్ సాంగ్, సంగీత కనిపించిన 'లాహే లాహే...' సాంగ్, కైలాష్ ఖేర్ సాంగ్ పాడిన ఒక ఎమోషనల్ సాంగ్ అన్నీ బానే ఉన్నాయి. పాటల విషయంలో ప్రేక్షకులను సంతృప్తి పరిచిన మణిశర్మ నేపథ్య సంగీతం విషయంలో నిరాశ పరిచారు. తిరు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ నీట్ గా ఉంది. టెంపుల్ టౌన్ సెట్ బావుంది.‌ ఆర్ట్ డైరెక్షన్ సూపర్. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తెరపై నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి కనిపించింది.

చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటిలా ఉంది. 'ఆచార్య'గా ఆయన అండర్ ప్లే చేశారు. అయితే... మెగాస్టార్ నుంచి అభిమానులు ఆశించే స్థాయిలో ఆయన క్యారెక్టర్ లేదు. అందువల్ల, పాత్ర పరిధి దాటి చేసే అవకాశం చిరంజీవికి లభించలేదు.‌ రామ్ చరణ్ మరో సారి స్టార్ హీరోగా కంటే నటుడిగా కనిపించారు.‌ చిరు, చరణ్ కనిపించే సన్నివేశాలు మాత్రం అభిమానులకు కన్నుల పండగ అని చెప్పాలి.‌ నిజం జీవితంలోని వాళ్ళిద్దరి బంధం... తెరపై పాత్రలకు సహాయ పడింది. ముఖ్యంగా బంజారా పాటలో వేసే స్టెప్స్ విజిల్ మూమెంట్ అని చెప్పాలి. పూజా హెగ్డే పాత్ర పరిధి తక్కువే. స్క్రీన్ మీద కనిపించిన అంతసేపు ఆకట్టుకున్నారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. సోను సూద్, జిష్షు సేన్ గుప్తా, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు తెరపై కనిపించారు.

Also Read: కన్మణి రాంబో కతీజా రివ్యూ: ఈ మల్టీస్టారర్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఆకట్టుకుంటుందా?

'ఆచార్య' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను డిజప్పాయింట్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా... టైమ్ పాస్ కోసం వెళ్ళిన ప్రేక్షకులకు సోసోగా అనిపిస్తుంది. మెగాభిమానులకు చిరంజీవి, రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించిన సన్నివేశాలు నచ్చుతాయి. పాట నచ్చుతుంది. అయితే... మెగా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్ప, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్... లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి మార్చి వరకూ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాల్లో అభిమానులు కోరుకునే మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఆచార్యలో అటువంటివి లేవు. సినిమాకు అది మైనస్. అక్కడికీ చిరంజీవి, రామ్ చరణ్ చాలా ప్రయత్నించారు. కానీ, వర్కవుట్ కాలేదు. ఇక, థియేటర్లకు వెళ్ళాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. బొగ్గు గనిలో ఒక ఫైట్ ఉంది. అందులో చిరంజీవి, చరణ్ కామెడీ టైమింగ్ ఫ్యాన్స్‌ను అల‌రిస్తుంది. అందులో చిరు కామెడీ టైమింగ్ కేక‌. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో న‌వ్వుకున్న సీన్ ఏదైనా ఉందంటే... అదొక్క‌టే.

Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 29 Apr 2022 10:57 AM (IST) Tags: chiranjeevi ram charan ABPDesamReview Acharya Review acharya review in telugu Acharya Movie Review Acharya Telugu Movie Review

సంబంధిత కథనాలు

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Don Review - 'డాన్' రివ్యూ: డాన్ నవ్వించాడు, ఏడిపించాడు - అయితే, మైనస్ ఏంటి? శివ కార్తికేయన్ సినిమా ఎలా ఉంది?

Don Review - 'డాన్' రివ్యూ: డాన్ నవ్వించాడు, ఏడిపించాడు - అయితే, మైనస్ ఏంటి? శివ కార్తికేయన్ సినిమా ఎలా ఉంది?

Sarkaru Vaari Paata Movie Review - 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?

Sarkaru Vaari Paata Movie Review - 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!