Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికెళ్లిన 'కెజియఫ్', 'సలార్' డైరెక్టర్ - ఇద్దరి కాంబోలో సినిమా?
విజయ్ దేవరకొండ హీరోగా 'కెజియఫ్', 'సలార్' సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ ఖబర్. ఇద్దరి కాంబోలో సినిమా కన్ఫర్మ్ అని వినికిడి.

ప్రశాంత్ నీల్... ఇప్పుడీ పేరును ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా 'ఉగ్రం'తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన 'కెజియఫ్' సినిమాతో నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లారు. రాకీ భాయ్ పాత్రలో యశ్ (Hero Yash)ను ఆయన చూపించిన తీరుకు ప్రేక్షకులు క్లాప్స్ కొట్టారు. ఇక, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తీసిన 'సలార్' సైతం యాక్షన్ మూవీ లవర్స్‌కు విపరీతంగా నచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చెయ్యడానికి హీరోలు అందరూ రెడీగా ఉన్నారని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు. అయితే, ఆయన ఏ హీరోతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నారు? అంటే...
విజయ్ దేవరకొండ హీరోగా సినిమా!?
Prashanth Neel To Direct Vijay Deverakonda?: 'అర్జున్ రెడ్డి' తెలుగులో తీసిన సినిమా అయినప్పటికీ... దాంతో నేషనల్ లెవల్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆయనతో ప్రశాంత్ నీల్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారా? అంటే... 'అవును' అని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) హైదరాబాద్ వచ్చారు. ఈసారి ఆయన విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఇద్దరి మధ్య కాసేపు సినిమాల గురించి సరదా సంభాషణ జరిగింది. ఆ తర్వాత మూవీ గురించి డిస్కస్ చేసుకున్నారని టాక్. మరి, ఆ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తారా? లేదంటే కథ అందించి మరొకరి చేతిలో డైరెక్షన్ పెడతారా? అనేది తెలియాల్సి వుంది.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!
పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'సలార్'కు సీక్వెల్ చెయ్యడానికి ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. 'కెజియఫ్ 3' కూడా ఆయన చెయ్యాలి. ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పారు. ఈ సినిమాల మధ్యలో తాను కథలు అందిస్తూ ఇతర డైరెక్టర్లతో యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. తన తొలి హీరో శ్రీమురళి 'భగీర'కు కూడా ఆయన కథ అందించి మరొకరికి డైరెక్షన్ ఇచ్చారు.
Also Read: 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!
'ది ఫ్యామిలీ స్టార్' సినిమాతో ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చారు విజయ్ దేవరకొండ. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. అందుకని, సినిమాల ఎంపికలో ఆచి తూచి అడుగులు వెయ్యాలని ఆయన భావిస్తున్నారట. పాన్ ఇండియన్ లెవల్‌లో తన ఇమేజ్‌కు సూట్ అయ్యేలా సినిమాలు తెరకెక్కించగల స్టార్ డైరెక్టర్స్ కోసం చూస్తున్నారు. అటువంటి టైంలో ప్రశాంత్ నీల్ వచ్చి ఆయన్ను కలవడంతో వాళ్లిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కడం ఖాయమని వినబడుతోంది. ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ కలిసి దిగిన ఫోటో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

