Sathi Leelavathi: మెగా కోడలు లావణ్య కొత్త సినిమా షురూ... పూజతో 'సతీ లీలావతి' ప్రారంభం
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన తారలుగా దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'సతీ లీలావతి' పూజతో ప్రారంభమైంది.

మెగా కోడలు లావణ్య కొణిదెల త్రిపాఠి (Lavanya Tripathi) వెండితెరపై సందడి చేసి ఆల్మోస్ట్ మూడేళ్లు అవుతోంది. వరుణ్ తేజ్ (Varun Tej Lavanya Tripathi)తో పెళ్లి, ఆ తర్వాత 'పులి మేక', 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌లు చేయడం వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ ప్రధాన పాత్రలో కొత్త సినిమా మొదలైంది.
'సతీ లీలావతి'గా లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi New Movie 2025: ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ అధినేత 'జెమిని' కిరణ్ సమర్పణలో 'సతీ లీలావతి' రూపొందుతోంది. లావణ్య త్రిపాఠితో పాటు మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో సందడి చేయనున్నారు. దుర్గా దేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. 'భీమిలీ కబడ్డీ జట్టు', 'ఎస్.ఎం.ఎస్' (శివ మనసులో శృతి) వంటి విభిన్న చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకుడు. నాగ మోహన్ బాబు .ఎమ్, రాజేష్ .టి నిర్మాతలు.
Sathi Leelavathi Movie: 'సతీ లీలావతి' సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి. ఆనంద ప్రసాద్, అన్నే రవి, దర్శకులు తాతినేని సత్య తండ్రి - సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి ప్రసాద్ సహా చిత్రసీమ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.
'సతీ లీలావతి' ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ ఇచ్చారు. టి.ఎల్.వి ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
'సతీ లీలావతి' సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ... ''మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా మా సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్ 'సతీ లీలావతి'. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంట చూడముచ్చటగా కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (ఫిబ్రవరి 3, సోమవారం) ప్రారంభిస్తున్నాం'' అని అన్నారు.
Also Read: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నిర్మాతలు నాగమోహన్ బాబు .ఎమ్, రాజేష్ .టి మాట్లాడుతూ... ''చిత్రసీమలో ఇది మా తొలి అడుగు. మా ప్రయాణంలో మాకెంతో మద్దతు ఇస్తున్న ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత కిరణ్ గారికి థాంక్స్. మా చిత్ర బృందాన్ని అభినందించడానికి వచ్చిన వరుణ్ తేజ్, ఇతర అతిథులకు స్పెషల్ థాంక్స్. ఈతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథను తాతినేని సత్య చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రమిది'' అని అన్నారు.
Sathi Leelavathi Cast And Crew: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా నటించనున్న ఈ సినిమాకు కూర్పు: సతీష్ సూర్య, కళా దర్శకత్వం: కోసనం విఠల్, మాటలు: ఉదయ్ పొట్టిపాడు, ఛాయాగ్రహణం: బినేంద్ర మీనన్, సంగీతం: మిక్కీ జె. మేయర్, సమర్పణ: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, నిర్మాణ సంస్థలు: దుర్గాదేవి పిక్చర్స్ - ట్రియో స్టూడియోస్, నిర్మాతలు: నాగమోహన్ బాబు .ఎమ్ - రాజేష్.టి, దర్శకత్వం: తాతినేని సత్య
Also Read: ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... నాగ చైతన్యతో విడాకుల తర్వాత డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

