మోడ్రన్ డ్రస్‌లు వేసి బోర్ కొట్టిందా? కుర్తాలో ట్రెండీగా కనిపించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే లావణ్య ఫ్యాషన్ ఛాయస్‌లు చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ పెళ్లికి వెళ్తున్నారా? స్లీవ్‌లెస్ లాంగ్ కుర్తా, ప్లెయిన్ దుప్పటా ధరిస్తే సూపర్ అంతే! అకేషన్ ఏదైనా సరే వైట్ అనార్కలి కుర్తా ధరిస్తే అందరి కళ్లు మీ మీదే! నెక్ దగ్గర వర్క్ లావణ్య అందాన్ని మరింత రెట్టింపు చేసింది కదూ! చుడిదార్ పైజామా, ప్లెయిన్ కుర్తా సెట్ మీద కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేయిస్తే డైలీ వేసుకోవడానికి కొంచెం కొత్తగా ఉంటుంది. సంక్రాంతి, హోలీ పండుగలకు రంగు రంగుల ముగ్గులు వేస్తారు. అప్పుడు వైట్ కుర్తా ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ట్రెడిషన్ ప్లస్ స్టైల్ కనిపించాలంటే ఇటువంటి కుర్తాను ధరిస్తే సరి! ఆఫీస్ కొలీగ్స్ గెట్ టుగెదర్, టీమ్ లంచ్ వంటి అకేషన్స్ ఉన్నాయా? ప్రింటెడ్ కుర్తా అయితే పర్ఫెక్ట్. ఫెయిర్, వైట్ కలర్ అమ్మాయిలు బ్లాక్ కుర్తా వేసి.... హ్యాండ్స్ చివర, దుప్పట్టాకు కాస్త వర్క్ ఉండేలా చూసుకుంటే లుక్ అదిరిపోతుంది. తల్లితో లావణ్య. ఈ డ్రస్‌లో పాటకు డ్యాన్స్ చేశారు. కుర్తాలో డ్యాన్స్ చేయడం కంఫర్టబుల్ అని ప్రూవ్ చేశారు. లావణ్య త్రిపాఠి (Image Courtesy: itsmelavanya / instagram)