Samantha: ఆ దర్శకుడితో సమంత చెట్టాపట్టాల్... డేటింగ్ న్యూస్ ఇలా కన్ఫర్మ్ చేసిందా?
Samantha Dating Raj Nidimoru: దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్... ఈ న్యూస్ ఎప్పటినుంచో వినబడుతుంది. ఈ మధ్య సమంత తీరు చూస్తే అది నిజమే అన్నట్టు ఉంది.

సమంత ఒంటరిగా ఉంటుందా? లేదంటే అతని జీవితంలో ఎవరైనా ఉన్నారా? యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ప్రేమలో పడిందా? ఇప్పుడు సమంత రిలేషన్షిప్ స్టేటస్ ఏమిటి? ఈ ప్రశ్నలు ప్రేక్షకులు చాలా మందిలో ఉన్నాయి. విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితం గురించి సమంత ఎప్పుడూ చెప్పింది లేదు. ఆ విషయంలో మౌనం వహించింది. సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే... డేటింగ్ న్యూస్ నిజమే అని కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంది.
రాజ్ నిడమోరుతో సమంత చెట్టాపట్టాల్!
నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి? అనేది ఎవరికీ తెలియదు. అయితే విడాకుల తర్వాత ఆ అంశం గురించి చైతన్య పెద్దగా మాట్లాడలేదు. కానీ, సమంత పరోక్షంగా చైతూ కారణం అన్నట్లు సోషల్ మీడియా పోస్టులు చేస్తుంది. ఆవిడను అక్కినేని అభిమానులు విమర్శిస్తూ ఉంటారు. సమంత వ్యవహార శైలి విడాకులకు కారణం అని ఆరోపించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే... 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని చాలా రోజులుగా వినబడుతోంది.
విడాకుల సమయంలో సమంత 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ చేయడం, అందులో క్యారెక్టర్ బోల్డుగా ఉండడం డిస్కషన్ పాయింట్ అయింది. కొన్నాళ్లకు ఆ వెబ్ సిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడమూరు సమంత డేటింగులో ఉన్నారని రూమర్లు వినిపించాయి. ఆ పుకార్లలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి అది కూడా సమంత చేసిన ఒక పని వల్ల.
Also Read: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన 'సిటాడెల్: హనీ బన్నీ'లోనూ సమంత నటించారు. ఇప్పుడు అదే దర్శక ద్వయం తీస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్'లో కూడా సమంత ఉన్నారు. వెబ్ సిరీస్ షూటింగ్ లోకేషన్ లేదా ప్రమోషనల్ కార్యక్రమాలలో రాజ్ నిడమోరుతో కలిసి సమంత కనిపిస్తే ప్రేక్షకులు ఎవరికీ పెద్దగా సందేహాలు వచ్చేవి కాదు. కానీ పిక్ బాల్ టోర్నమెంట్ దగ్గర సమంత, రాజ్ నిడమోరు చేతిలో చెయ్యేసుకుని, చెట్టపట్టాలేసుకుని తిరగడం పుకార్లకు మళ్ళీ ఊతం ఇచ్చినట్టు అయింది.
View this post on Instagram
పిక్ బాల్ టోర్నమెంట్ కోర్టులో రాజ్ నిడమోరు, సమంత కలిసి నడుస్తూ కనిపించారు. అంతే కాదు... గ్రూప్ ఫోటో దిగిన సమయంలో ఒకరి చేతిలో మరొకరి చేయ ఉంది. దాంతో వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు ఇలా కన్ఫర్మ్ చేశారని ఫిలిం నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. పిక్ బాల్ టోర్నమెంట్ విషయానికి వస్తే చెన్నై సూపర్ ఛాన్స్ టీం యాజమాన్యంలో సమంత కూడా ఉంది. ఆవిడకు మద్దతుగా రాజ్ వచ్చారు, అది సంగతి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

