Kannappa: 'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?
Kannappa Box Office Collection First Day: జూన్ 27న డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' థియేటర్లలోకి వస్తుంది. ఓపెనింగ్ డే కలెక్షన్ మీద ఇండస్ట్రీలోనూ అంచనాలు ఉన్నాయి.

డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఈ వారం థియేటర్లలోకి వస్తుంది. జూన్ 27న సినిమా విడుదల. భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? అనేది తెలుసుకోవాలని ఇండస్ట్రీ సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు!?
'కన్నప్ప' బడ్జెట్ ఎంత అనేది విష్ణు మంచు ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. అయితే సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకు డిజిటల్ అండ్ శాటిలైట్ డీల్ కంప్లీట్ కాలేదు. ఓటీటీ సంస్థలు ఆఫర్ చేసిన అమౌంట్ విష్ణుకు నచ్చలేదు. దాంతో విడుదల తర్వాత సినిమా డిజిటల్, టీవీ రైట్స్ అమ్మాలని డిసైడ్ అయ్యారు. అలాగే సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా ఎవరికీ ఇవ్వలేదు. మెజారిటీ ఏరియాలలో ఆయన సొంతంగా విడుదల చేస్తున్నారు. కమిషన్ బేస్ మీద ఎగ్జిబిటర్లకు సినిమా ఇచ్చారని తెలిసింది.
విష్ణు మంచు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... మొదటి రోజు ఈ సినిమా 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారట. మరి ఆ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా? అనేది జూన్ 27న తెలుస్తుంది.
సౌతిండియాలో మంచి బజ్...
నార్త్ ఇండియా లోను భారీ క్రేజ్!
'కన్నప్ప'లో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషించారు. పరమేశ్వరుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఆయన సరసన పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. వాళ్ళిద్దరికీ నార్త్ ఇండియాలో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్రుడి పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల, హిందీలో ఈ సినిమాకు భారీ క్రేజ్ లభించింది.
సౌత్ ఇండియా నుంచి 'కన్నప్ప'లో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి సీనియర్ స్టార్ హీరోలు నటించారు. సో ఇక్కడ కూడా మంచి పర్సన్ ఉంది. అందుకని సినిమాకు హిట్ టాక్ వస్తే భారీ ఓపెనింగ్ రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఎన్ని కోట్లు వస్తుంది అనేది చూడాలి.
Kannappa release screen count: ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5400 స్క్రీన్లలో 'కన్నప్ప' సినిమాను విడుదల చేస్తున్నారు. అమెరికాలో భారీ ఎత్తున ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. ఒక్క ఇండియాలో 4300 పైగా స్క్రీన్లలో సినిమా రిలీజ్ అవుతుంది. భారీ తారాగణం ఉండటం, ట్రైలర్ బాగుండడం, పాటలు సినిమాపై అంచనాలు పెంచడం 'కన్నప్ప'కు కలిసి వచ్చే అంశాలు. విష్ణు మంచు సినిమాకు రీసెంట్ టైంలో ఇంత పాజిటివ్ బజ్ రావడం ఇదే. అందువల్ల మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా? లేదంటే ఇంకా తక్కువ చేస్తుందనేది చూడాలి.
Also Read: ఓటీటీలోకి '8 వసంతాలు'... అనుకున్న తేదీ కంటే ముందుగా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?





















