8 Vasantalu OTT: ఓటీటీలోకి '8 వసంతాలు'... అనుకున్న తేదీ కంటే ముందుగా - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
8 Vasantalu OTT Platform: ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా '8 వసంతాలు'. థియేటర్లలో ఆదరణ అంతంతమాత్రంగా ఉంది. అందువల్ల త్వరలో ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇండిపెండెంట్ ఫిలిం 'మధురం', ఫీచర్ ఫిలిం 'మను'తో పాపులర్ అయిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా '8 వసంతాలు'. జూన్ 20న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇంకా చెప్పాలంటే అమెరికాలో రెండు రోజుల ముందు ప్రీమియర్స్ వేశారు. తెలుగు రాష్ట్రాలలో ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి రెగ్యులర్ షోస్ వరకు ఆడియన్స్ నుంచి ఆదరణ అంతంతమాత్రంగా ఉంది. హిట్ టాక్ రాలేదు. అందువల్ల త్వరలో ఓటీటీలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.
'8 వసంతాలు' స్ట్రీమింగ్ ఎందులో?
డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడు?
When and Where to watch 8 Vasanthalu on OTT: ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ '8 వసంతాలు' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. తెలుగులో రూపొందిన ఈ సినిమాను తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా అనువదించే అవకాశం ఉందని వినికిడి.
తెలుగుతో పాటు ఏయే భాషల్లో '8 వసంతాలు' స్ట్రీమింగ్ అవుతుంది? అనేది పక్కన పెడితే... జూలై మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందట. లేదంటే జూలై రెండో వారంలో ఓటీటీ రిలీజ్ కావడం గ్యారెంటీ.
'8 వసంతాలు' సక్సెస్ మీట్‌లో సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి సిహెచ్ త్వరలో ఓటీటీ రిలీజ్ అవుతుందని, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఇంకా క్వాలిటీగా ఉంటుందని, చూడమని చెప్పుకొచ్చారు. దాంతో అందరికీ మరింత క్లారిటీ వచ్చింది. థియేటర్లలో సినిమా డిజాస్టర్ కావడంతో త్వరగా ఓటీటీకి తీసుకువచ్చి క్యాష్ చేసుకోవాలని ప్రొడ్యూసర్లు డిసైడ్ అయినట్లు ఉన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని రవిశంకర్ వై '8 వసంతాలు' సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాకు ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు బడ్జెట్ అయిందని సమాచారం. అయితే ఏడు నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చాయట. ముందుగా అనుకున్న తేదీ కంటే ఎర్లీగా ఓటీటీ రిలీజ్ చేయడం వల్ల ఇంకాస్త అమౌంట్ వచ్చే అవకాశం ఉంది.
సినిమా కథ ఏమిటి? ఏం చెప్పారు?
'8 వసంతాలు' సినిమాలో శుద్ధి అయోధ్య పాత్రలో హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ నటించారు. ఆమెది ఊటీ. తండ్రి ఆర్మీ ఆఫీసర్. ఆయన మరణం తర్వాత తల్లి టీ ఎస్టేట్ బాధ్యతలు చూసుకోవడంతో పాటు కుమార్తెను పెంచుతుంది. తండ్రి మరణం తర్వాత ఎదురైన అనుభవాలతో శుద్ధి అయోధ్య ఒక పుస్తకం రాస్తుంది. దానికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అందరూ ఎంతో పొగుడుతారు. రెండో పుస్తకం రాయడానికి వెళ్లే ముందు ఊటీలో ఆమెకు ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అమ్మాయి పుస్తకం రాయడానికి కాశ్మీర్ వెళితే... ప్రతి ఆదివారం ఆమెను చూడడానికి వెళతాడు. అతడిని శుద్ధి అయోధ్య ప్రేమిస్తుంది. అయితే... తండ్రి సంతోషం కోసం ఆమెను అవమానిస్తాడు.
Also Read: బ్రాహ్మణులు రేపిస్టులా? '8 వసంతాలు' టీంపై మీడియా ఫైర్... సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన డైరెక్టర్!
బ్రేకప్ బాధ నుంచి కోలుకున్న శుద్ధి అయోధ్యకు ఊటీలో ఓ తెలుగు రచయిత పరిచయం అవుతుంది. అతడిని ప్రేమిస్తుంది. అయితే... తల్లి సంతోషం కోసం ఆ ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. ఆఖరికి ఆ అబ్బాయికి కూడా అసలు విషయం చెప్పదు. కుమార్తె ప్రేమ విషయం తల్లికి తెలిసిందా? మొదట ప్రేమించిన అబ్బాయి మళ్ళీ తిరిగి వచ్చాడా? శృతి అయోధ్య ప్రేమించిన రెండో అబ్బాయి నేపథ్యం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: డ్రగ్స్ కేసులో హీరో శ్రీకాంత్ అరెస్ట్... చెన్నైలో రాజకీయ నాయకుడికీ లింకులు?





















