8 Vasanthalu: సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టిన '8 వసంతాలు' డైరెక్టర్... బ్రాహ్మణులు రేపిస్టులా? టీంపై మీడియా ఫైర్!
8 Vasanthalu Success Meet: '8 వసంతాలు' విడుదలకు ముందు ప్రేక్షకుల అర్హత, కమర్షియల్ సినిమాపై దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే మూవీ ఫ్లాప్ అయ్యింది.

'8 వసంతాలు' సినిమాలో పాటలు, ప్రచార చిత్రాల కంటే... దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. విడుదలకు ముందు ప్రేక్షకుల అర్హతను ఆయన ప్రశ్నించారు. కమర్షియల్ సినిమా గురించి కామెంట్ చేశారు. సో కాల్డ్ కమర్షియల్ సినిమా రాయలేక - తీయలేక కాదని, కాసేపు పెన్ను - కవిత్వం పక్కన పెడితే తాను ఎలా రాస్తాను? అనేది వారణాసిలో తీసిన ఫైట్‌లో చూస్తారని తెలిపారు.
కట్ చేస్తే... సినిమా డిజాస్టర్ అయ్యింది. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య తక్కువ. పలు మల్టీప్లెక్స్‌లలో టికెట్లు తెగక '8 వసంతాలు' షోలు క్యాన్సిల్ చేశారని ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పుడీ డిజాస్టర్ సినిమాకు సక్సెస్ మీట్ నిర్వహించారు.
సక్సెస్ మీట్‌కు డైరెక్టర్ డుమ్మా...
ఆఖరికి నిర్మాతలు కూడా రాలేదు!
'8 వసంతాలు' విడుదలకు ముందు సినిమా గురించి గొప్పలు చెప్పిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి... విడుదలైన తర్వాత మీడియాకు ముఖం చాటేశారు. హీరో హీరోయిన్లతో పాటు సినిమాలో నటించిన ఆర్టిస్టులు, సినిమాటోగ్రాఫర్ సక్సెస్ మీట్‌కు వచ్చారు తప్ప దర్శకుడు రాలేదు. ఆఖరికి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని గానీ, రవిశంకర్ వై గానీ హాజరు కాలేదు. దాని వెనుక గొడవ జరిగినట్టు టాక్.
బ్రాహ్మణుడిని రేపిస్టులా చూపిస్తారా?
'8 వసంతాలు' దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి గొప్పగా చెప్పిన వారణాసి ఫైట్ మీద అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ శుద్ధి అయోధ్యను రేప్ చేయాలనే ఆలోచనతో ఒక బ్రాహ్మణుడు కబేళాకు తీసుకువెళ్లడం, ముస్లింలతో కలిసి ఆ అమ్మాయి మీద ఆఘాయిత్యానికి పాల్పడాలని అనుకోవడం, అది కూాడా కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో తీయడం పట్ల కొందరు మీడియా ప్రతినిధులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో ఇతర పాత్రధారుల కులాల గురించి ప్రస్తావించలేదని, వారణాసిలో రేప్ చేయాలని అనుకున్న వ్యక్తిని బ్రాహ్మణుడిగా చూపించడం ఏమిటి? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? అని ప్రశ్నించారు.
Also Read: డ్రగ్స్ కేసులో హీరో శ్రీకాంత్ అరెస్ట్... చెన్నైలో రాజకీయ నాయకుడికీ లింకులు?
#8Vasantalu :
— IndiaGlitz Telugu™ (@igtelugu) June 23, 2025
కాశీ లాంటి పుణ్య క్షేత్రం లో ఆ సీన్స్ ఏంటి ?
సినిమా యూనిట్ పై ఫైర్ అయిన మీడియా... pic.twitter.com/5HJ5eD6bvH
దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి డుమ్మా కొట్టడం వల్ల చిత్ర బృందం ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదు. సినిమాకు దర్శకుడు - రచయిత ఒక్కరే కనుక ఆయనే సరైన సమాధానం చెప్పగలరని హీరోగా నటించిన రవి దుగ్గిరాల పేర్కొన్నారు. డిజాస్టర్ సినిమాకు సక్సెస్ మీట్ పెట్టడం విమర్శలకు దారి తీస్తే... దర్శకుడు తీసిన ఫైట్ పట్ల మీడియా ఫైర్ అవడం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. థియేటర్లలో అంతగా ఆడని ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. దీనికి ముందు దర్శకుడు తీసిన మను కూడా ఫ్లాపే.
Also Read: సెంట్రల్‌లో బీజేపీ మంత్రికి సెన్సార్ షాక్... ఈ వారం సినిమా రిలీజ్ లేనట్టేనా?





















