Sriram alias Srikanth: డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్... చెన్నైలో రాజకీయ నాయకుడికీ లింకులు?
Sriram Drug Case: తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో మాజీ రాజకీయ నాయకుడు సైతం ఉండటం గమనార్హం.

అటు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తాజా డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు, తమిళ్... రెండు భాషల్లోనూ పలు సినిమాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇందులో మాజీ రాజకీయ నాయకుడి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీరామ్!
'రోజా పూలు' (తమిళంలో 'రోజా కూటం') సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తిరుపతి అబ్బాయి శ్రీకాంత్. తమిళంలో నాలుగు సినిమాలు చేసిన తర్వాత తెలుగులో అడుగు పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ శ్రీకాంత్ పేరు శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ మేక ఉండటంతో తెలుగు వరకు అయన పేరును శ్రీరామ్ అని మార్చుకున్నారు.
శ్రీరామ్ హీరోగా నటించిన తెలుగు సినిమా 'ఒకరి ఒకరు'. అందులో పాటలు చార్ట్ బస్టర్స్ కావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. దాంతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు కానీ ఆశించిన స్థాయికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు అనూహ్యంగా శ్రీరామ్ పేరు డ్రగ్స్ కేసులో తెరపైకి వచ్చింది.
చెన్నై పోలీసులు శ్రీరామ్ (శ్రీకాంత్)ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. రెండు గంటలుగా చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు ఆయన్ను విచారించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, రక్త నమూనాలు సేకరించారు.
Also Read: సెంట్రల్‌లో బీజేపీ మంత్రికి సెన్సార్ షాక్... ఈ వారం సినిమా రిలీజ్ లేనట్టేనా?
మాజీ AIADMK కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు చెన్నై పోలీసుల నుంచి బయటకు వచ్చిన ప్రాథమిక సమాచారం. ప్రసాద్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నారట. ప్రసాద్, మరో ఇద్దరు ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ చేసి హీరోని విచారిస్తున్నారు.
గతేడాది ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన 'వళరి' సినిమాలో శ్రీరామ్ నటించారు. ఆయన హీరోగా నటించిన 'ఎర్రచీర' విడుదలకు రెడీ అవుతోంది. కొన్నాళ్లుగా ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. నాగ చైతన్య 'దడ', రవితేజ 'రావణాసుర', 'నిప్పు', నితిన్ 'లై' తదితర సినిమాల్లో శ్రీరామ్ కీలక పాత్రలు చేశారు.
Also Read: బీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్... ఫోటోలు చూడండి





















