James Cameron: RRRపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్ కామెరూన్ - స్పందించిన మూవీ టీమ్!
RRR : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి 'RRR' సినిమాపై ప్రశంసలు కురిపించారు.
![James Cameron: RRRపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్ కామెరూన్ - స్పందించిన మూవీ టీమ్! james cameron heaps praise on ss rajamoulis rrr James Cameron: RRRపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్ కామెరూన్ - స్పందించిన మూవీ టీమ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/07/93eac41544ec87c3b27346c4930119381707288807762753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ 'RRR' ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయో అంతకుమించి ప్రశంసలు దక్కాయి. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమాని ఎంతగానో ఇష్టపడ్డారు. ముఖ్యంగా హాలీవుడ్ సెలబ్రిటీస్ 'RRR' చూసి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి సుమారు రెండేళ్లు అవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఎక్కడో చోట ఎవరో ఒకరు 'RRR' గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి RRR' పై ప్రశంసలు కురిపించారు.
హాలీవుడ్ అవార్డ్స్ ఈవెంట్ లో రాజమౌళిని అభినందించిన జేమ్స్ కామెరూన్
అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ గతంలో 'RRR' మూవీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హాలీవుడ్ లో జరిగిన 51 వ సాటర్న్ అవార్డ్స్ ఈవెంట్ లో మరోసారి రాజమౌళిని అభినందించారు. ఈ ఈవెంట్ లో భాగంగా యాంకర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి 'RRR' గురించి అడిగినప్పుడు జేమ్స్ బదులిస్తూ.." నేను పలు సందర్భాల్లో కొంతమందిని చూసి స్ఫూర్తి పొందాను. స్టీవెన్ స్టీల్ బర్గ్స్ ని చూసుకుంటే ఆయన వర్క్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. కొత్త దర్శకులకు వస్తున్న ఆలోచనలు నాకెందుకు రావడంలేదని కొన్నిసార్లు బాధపడుతుంటాను. 'RRR' మూవీని చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. రాజమౌళి తన వర్క్ తో ప్రపంచం మొత్తం నచ్చేలా ఆ సినిమా ని రూపొందించారు. ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గా ఇలా సత్తా చాటడం చాలా గొప్ప విషయం" అని అన్నారు.
James Cameron.. 🤗
— RRR Movie (@RRRMovie) February 7, 2024
Your precious words always inspire us to strive better and be the best.
We strongly believe Indian cinema is going to break all boundaries and grow to its fullest. ❤️ #RRRMovie pic.twitter.com/pzHjGQNZnC
జేమ్స్ కామెరూన్ కామెంట్స్ పై 'RRR' టీమ్ రియాక్షన్
హాలీవుడ్ అవార్డ్స్ ఈవెంట్ లో జేమ్స్ కామెరూన్ 'RRR' పై రాజమౌళి పై చేసిన వ్యాఖ్యలకు మూవీ టీం ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయింది. ఈ మేరకు జేమ్స్ కామెరూన్ RRR గురించి మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ.." జేమ్స్ కామెరూన్.. మీ విలువైన మాటలు ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని అన్ని హద్దులను దాటి పెద్ద స్థాయికి ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం" అంటూ ట్వీట్స్ చేసింది.
'SSMB 29' గురించి..
'RRR' తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ ప్రాజెక్ట్ అడ్వెంచర్ మూవీగా రూపొందనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. పౌరాణిక సూపర్ హీరో హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయుడికి ఉన్న లక్షణాలు ఈ సినిమాలో మహేష్ కు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ కీలక పాత్ర పోషించేందుకు సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ మూవీని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఉగాదికి ఈ సినిమా లాంచనంగా ప్రారంభం కానుందని అంటున్నారు.
Also Read : ‘ఫైటర్’లో లిప్ లాక్ సీన్ - లీగల్ నోటీసులు పంపిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)