Jr NTR Speech : మళ్ళీ ఆస్కార్ కొడతాం - స్టేజిపై ఇద్దరు తెలుగోళ్ళు కనిపించారు, కిక్ ఇచ్చే ఎన్టీఆర్ స్పీచ్
Das Ka Dhamki pre release - NTR Speech : ఆస్కార్ అవార్డును ప్రేక్షకులు సాధించారన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఆస్కార్స్ గురించి విపులంగా మాట్లాడారు.
''ఆస్కార్ అవార్డును (Naatu Naatu Song Won Oscar) సాధించినది ఆ చిత్రానికి పని చేసిన మేం కాదు... మా అందరితో పాటు మీరూ (ప్రేక్షకులు, అభిమానులు) ఆ అవార్డు సాధించారు. మీ అందరి బదులు మేం అక్కడ నిలబడ్డాం. మా బదులు కీరవాణి గారు, బోస్ గారు అక్కడ నిలబడ్డారు'' అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అన్నారు.
విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki Movie). ఆయన హీరోగా నటించడమే కాదు... ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. మార్చి 22న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రమిది. ఈ రోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ (Das Ka Dhamki Pre Release) వేడుక నిర్వహించారు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆస్కార్స్ నుంచి వచ్చిన తర్వాత ఆయన హాజరైన తొలి వేడుక ఇది. ఇందులో ఆస్కార్స్ గురించి ఆయన విపులంగా మాట్లాడారు.
ఆస్కార్ వేదికపై ఇద్దరు తెలుగువాళ్ళు కనిపించారు
''కీరవాణి గారు, చంద్రబోస్ గారిని ఆస్కార్స్ వేదికపై చూస్తుంటే... నాకు ఇద్దరు భారతీయులు కనిపించారు. ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు. ఆ స్టేజి మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. టీవీలో చూసి మీరు ఎంత ఉత్సాహం పొందారో నాకు తెలియదు గానీ... ఈ రెండు కళ్ళతో చూడటం మాత్రం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అటువంటి ఆనందాన్ని మళ్ళీ ఎప్పుడు పొందుతామో తెలియదు. కానీ, పొందుతాం. 'ఆర్ఆర్ఆర్' ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారతీయ చిత్రాలు ఇంకా మున్ముందుకు సాగాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను'' అని ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా నిలబడుతుందని, మళ్ళీ మనమంతా ఆనందపడే రోజులు వస్తాయని ఆయన మాటలు చెప్పకనే చెప్పాయి.
ఆస్కార్ రావడానికి ప్రేక్షకుల అభిమానమూ కారణమే
ఆస్కార్ విజయం వెనుక చిత్ర బృందం కృషితో పాటు అభిమానుల ప్రేమ కూడా ఉందని ఎన్టీఆర్ చెప్పారు. 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీ రామారావు మాట్లాడుతూ ''ఈ రోజు 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచ పటంలో నిలబడిందంటే... ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుందంటే... దానికి మా జక్కన్న (రాజమౌళి) గారు ఎంత కారకులో? కీరవాణి గారు ఎంత కారకులో? చంద్రబోస్ గారు ఎంత కారకులో? పాట పాడినటువంటి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఎంత కారకులో? ఆ పాటను కొరియోగ్రఫీ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ ఎంత కారకులో? వీళ్లందరితో పాటు యావత్ తెలుగు చిత్రసీమ, అలాగే భారతీయ చిత్రసీమ కూడా అంతే కారణం. ప్రేక్షక దేవుళ్ళు కూడా అంతే కారణం. వాళ్లందరితో పాటు మీ అభిమానం ముఖ్యమైన కారణం'' అని చెప్పారు.
Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల 'పాప' ఎలా ఉందంటే?
వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై విశ్వక్ సేన్ తండ్రి 'కరాటే' రాజు 'దాస్ కా ధమ్కీ' నిర్మించారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. 'ధమాకా' విజయం తర్వాత ఆయన సంభాషణలు రాసిన చిత్రమిది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : దినేష్ కె బాబు, సంగీతం : లియోన్ జేమ్స్, ఎడిటర్ : అన్వర్ అలీ, కళా దర్శకత్వం : ఎ. రామాంజనేయులు, ఫైట్స్ : టోడర్ లాజరోవ్ - జుజి, దినేష్ కె బాబు, వెంకట్.
Also Read : విజయ్ 'లియో'లో లోకేష్ ఫస్ట్ ఛాయస్ త్రిష కదా? యంగ్ హీరోయిన్ 'నో' చెప్పడంతో ఛాన్స్ వచ్చిందా?