అన్వేషించండి

చెర్రీ, తారక్ ఫ్యాన్ వార్ - రామ్ చరణ్ 'గ్లోబల్ స్టార్' అయితే, మరి ఎన్టీఆర్ ఏంటి?

'గ్లోబల్ స్టార్' ట్యాగ్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. అయితే ఈ టైటిల్ ను ఫైనల్ గా చెర్రీ సొంతం చేసుకున్నట్లు మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

త కొన్ని నెలలుగా 'గ్లోబల్ స్టార్' ట్యాగ్ చుట్టూ సోషల్ మీడియాలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ తమ హీరోకే కరెక్ట్ అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. నిత్యం ఫ్యాన్ వార్ చేసుకుంటూ నెట్టింట రచ్చ చేశారు. అయితే చివరికి, గ్లోబల్ స్టార్ ట్యాగ్ చరణ్ కు ఫిక్స్ అయినట్లు ఓ వర్గం ఫ్యాన్స్ ట్విట్టర్ లో హంగామా చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన భారీ యాక్షన్ మూవీ 'ఆర్ ఆర్ ఆర్' (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలానే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని, ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డ్ ను ఇండియాకు తీసుకొచ్చింది.

అయితే RRR సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచీ, ఆస్కార్ అవార్డ్ సాధించడం వరకూ తారక్, చరణ్ అభిమానుల మధ్య తరచుగా ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరికి అనే విషయం మీద ఇరు వర్గాలు పెద్ద ఎత్తున ఫైట్ చేశాయి. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఎవరికి సొంతం అనే దానిపై కూడా ఫ్యాన్ వార్ జరిగింది. ట్రిపుల్ ఆర్ కు హలీవుడ్ ప్రశంసలు దక్కిన తర్వాత, గ్లోబల్ స్టార్ డమ్ ఇద్దరిలో ఎవరికి వచ్చిందనే విషయంలో ఓ రేంజ్ లో ఫైట్ చేసుకున్నారు.

గ్లోబల్ స్టార్ మా హీరోకే సొంతం అంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తే, కాదు ఆ ట్యాగ్ కి రామ్ చరణ్ మాత్రమే అర్హుడు అంటూ మెగా అభిమానులు ట్రెండింగ్ చేశారు. చరణ్ బర్త్ డే విసెష్‌లో కూడా ‘గ్లోబల్ స్టార్’‌ను వాడేశారు. ఇలా RRR హీరోల టైటిల్స్ విషయంలో నెట్టింట హంగమా చేస్తున్నారు. అయితే ఫైనల్ గా ‘గ్లోబల్ స్టార్’ అనే ప్రిఫిక్స్ తో చెర్రీ పేరుకు ముందు ఫిక్స్ అయినట్లు మెగా ఫ్యాన్స్ నిర్ణయానికి వచ్చేశారు. గ్రాండ్ గా చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగిన తర్వాత, ఇకపై ఆ ట్యాగ్ తమ అభిమాన హీరోకే అని పేర్కొంటున్నారు.

RRR చిత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఆస్కార్ ప్రమోషన్ మొదలు పెట్టిన తరువాత, స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి ప్రఖ్యాత హలీవుడ్ డైరెక్టర్లు ఈ చిత్రాన్ని వీక్షించినట్లు ప్రకటించారు. ఫలితంగా, తారక్, చరణ్ లు ప్రత్యేకమైన టైటిల్ ను పొందేందుకు ప్రేరేపించబడ్డారు.

నిజానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయిలో అప్రిషియేషన్స్ దక్కాయి. కాకపోతే ఆ క్రెడిట్ ని తమ సొంత పబ్లిసిటీకి వాడుకోవడంలో చెర్రీ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. దీని కోసం అతని టీం అంతా ఎప్పటికప్పుడు మెగా హీరోని ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఆస్కార్ వెళ్ళడం దగ్గర నుంచి, ఆస్కార్ తర్వాత హైదరాబాద్ కు రావడం వరకూ.. ప్రతీది హాట్ టాపిక్ గా నిలిచేలా ప్లాన్ చేశారు. కారణాలు ఏవైనా కావచ్చు ఆ విషయంలో మాత్రం నందమూరి వారసుడు కాస్త వెనుక పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.

'గ్లోబల్ స్టార్' (#GlobalStar) అనే టైటిల్ నిస్సందేహంగా ఒక యునిక్ ట్యాగ్ అనే చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ అది రామ్ చరణ్ కు ఫిక్స్ అయినా, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే అంతకంటే మరింత గొప్పదైన 'యూనివర్సల్ స్టార్' (#UniversalStar) అనే ట్యాగ్ తో ఇప్పటి నుంచి తారక్ ను పిలవాలని భావిస్తున్నారట. రాబోయే బర్త్ డేకి ఇదే టైటిల్ తో ట్రెండ్ చేసే అవకాశం వుంది. ఇప్పటికే 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అనే ట్యాగ్ ను సాధించడంలో ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు.  మరి రానున్న రోజుల్లో ఎన్టీఆర్ యూనివర్సల్ స్టార్ అనిపించుకుంటారేమో చూడాలి. 

Read Also: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget