NBK109 : బాలయ్య - బాబీ మూవీకి ఊరమాస్ టైటిల్? ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా!
NBK109 : బాలయ్య - బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి మూవీ టీం టైటిల్‌ను ఖరారు చేసినట్లు తాజా సమాచారం.
Crazy title for Balakrishna and Bobby’s film : నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'NBK109' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ వీడియో ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ని చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది.
బాలయ్య - బాబీ మూవీకి క్రేజీ టైటిల్
'NBK109' మూవీ టీం తాజాగా ఓ మాస్ టైటిల్ ని అనుకున్నారట. దర్శకుడు బాబి ఈ సినిమాకి 'వీరమాస్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు లేటెస్ట్ ఫిలిమ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ 'వీరమాస్' అనే టైటిల్ బాలయ్య ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ టైటిల్ తో కూడిన హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో ఈ 'వీరమాస్' అనే టైటిల్ని మేకర్స్ ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే టైటిల్ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.
కీలకపాత్రలో మలయాళ స్టార్ హీరో
బాలయ్య - బాబి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్ర చేస్తున్నారు. సినిమాలో దుల్కర్ రోల్ చాలా కీలకంగా ఉంటుందట. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తో కొన్ని సీన్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఇతనితో పాటు మరో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలయ్యకి విలన్ గా బాబీ డియోల్
'యానిమల్' సినిమాలో విలన్ అదరగొట్టిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబి డియోల్ 'NBK109' లో విలన్ గా కనిపించనున్నాడు. ఇటీవలే బాబీ డియోల్‌ను మూవీ సెట్‌లోకి ఆహ్వానిస్తూ ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. సినిమాలో బాలయ్య - బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. కాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేల సైతం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ లో మెరువనుంది.
బాలయ్య గత మూడేళ్ళుగా తన కెరీర్ లోనే మునుపెన్నడూ లేనంత ఫార్మ్ లో కొనసాగుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేస్తున్న NBK 109 మూవీ కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బానర్లపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
Also Read : ‘కన్నప్ప’ కోసం బాలీవుడ్ ఖిలాడీ - అతిథి పాత్రలో హిందీ స్టార్ హీరో!