అన్వేషించండి

Kannappa Movie: ‘కన్నప్ప’ కోసం బాలీవుడ్ ఖిలాడీ - అతిథి పాత్రలో హిందీ స్టార్ హీరో!

Manchu Vishnu Kannappa: మంచు విష్ణు తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ క్యాస్టింగ్ చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఆశ్చర్చపోతున్నారు. ఇక తాజాగా ఇందులో ఓ బాలీవుడ్ హీరో కూడా భాగం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి

Akshay Kumar In Manchu Vishnu Kannappa: మంచు హీరో విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ స్కేల్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎన్నో అప్డేట్స్‌ను ప్రేక్షకులతో పంచుకున్నారు విష్ణు. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ది బ్రేవెస్ట్‌ వారియర్‌, ది అల్టిమేట్‌ డీవోటి అంటూ ఇంట్రెస్టింట్ ట్యాగ్ లైన్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పటికే థాయ్‌ల్యాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ‘కన్నప్ప’ షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ చిత్రం గురించి పలు రూమర్స్ సినీ సర్కిల్లో వైరల్ కాగా... ఇప్పుడు ఇందులో ఓ బాలీవుడ్ స్టార్ కూడా యాడ్ అవ్వనున్నట్టు తెలిసింది.

మరో గెస్ట్ రోల్...

ఇప్పటికే ‘కన్నప్ప’ సినిమాలో ఇండియన్ సినీ పరిశ్రమలోని చాలామంది స్టార్లు భాగం కానున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. అంతే కాకుండా ప్రభాస్ కూడా ఇందులో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్టు రూమర్స్ రాగా.. అవి పూర్తిగా అబద్ధం కాదని కూడా తెలిపారు. ఇప్పుడు అదే తోవలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ‘కన్నప్ప’లో ఓ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నట్టు వార్తలు వినిపించడం మొదలయ్యింది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో చిన్న రోల్‌లో కనిపిస్తున్నాడని రూమర్స్ వస్తున్నా... అది ఏ రోల్ అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇది విన్న తెలుగు ప్రేక్షకులు షాకవుతున్నారు. ‘కన్నప్ప’ చిత్రాన్ని మంచు విష్ణు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారో ఈ స్టార్ క్యాస్టింగ్ చూస్తే అర్థమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ క్యాస్టింగ్..

‘కన్నప్ప’లో మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటిస్తుండగా... ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, శరత్ కుమార్, శివ రాజ్‌కుమార్, మధూ, దేవరాజ్, ప్రీతి ముకుందాన్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బ్రహ్మానందం కూడా ఇందులో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ స్టార్ క్యాస్టింగ్‌ను చూసి ఇప్పటికే ప్రేక్షకులు ఆశ్చర్యపోతుండగా... ఇందులో అక్షయ్ కుమార్ కూడా యాడ్ అవ్వడం వారిని మరింత ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీతో విష్ణు కుమారుడు అవ్రామ్ మంచు కూడా వెండితెరపై డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇలా రోజు రోజుకీ ‘కన్నప్ప’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే అప్డేట్ ఏదో ఒక బయటికి రావడంతో మూవీకి మెల్లగా హైప్ పెరుగుతోంది.

హాలీవుడ్ టెక్నీషియన్లతో...

‘కన్నప్ప’ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. షెల్డన్ చౌ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు స్వీకరించారు. శివుడిపై, శివభక్తుడిపై తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్‌ను శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో మంచు విష్ణు విల్లు, బాణం పట్టుకొని కన్నప్పగా కనిపించారు. ఈ మూవీ కోసం తను పూర్తిగా మేక్ ఓవర్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ మూవీని హలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని కలలు కన్న విష్ణు.. మొత్తం 600 మంది టెక్నీషియన్లను రంగంలోకి దించారు. 2024లోనే ‘కన్నప్ప’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఒకవేళ అది కుదరకపోతే 2025 మొదట్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Also Read: పుష్పరాజ్ మాస్ జాతర షురూ... 'పుష్ప 2' టీజర్ వచ్చేసిందోచ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget