Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర షురూ... 'పుష్ప 2' టీజర్ వచ్చేసిందోచ్
Watch Pushpa The Rise Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప: ది రైజ్' టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు (ఏప్రిల్ 8) నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు 'పుష్ప: ది రూల్' యూనిట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. 'పుష్ప 2' టీజర్ విడుదల చేసింది.
జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించిన, ఉత్తమ నటుడిగా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్ 'పుష్ప 2'. దాంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచిందని చెప్పవచ్చు.
పుష్పరాజ్ మాస్ జాతర షురూ!
Pushpa 2 Teaser Review: మాస్... పుష్పరాజ్ మాస్... అన్నట్టు ఉందీ 'పుష్ప 2' టీజర్. ఇందులో గంగమ్మ జాతరను హైలైట్ చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. ఆ లుక్ ఈ టీజర్ లోనూ కంటిన్యూ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది.
టీజర్ విజువల్స్ ఒక ఎత్తు... ఐకాన్ స్టార్ లుక్ & పెర్ఫార్మన్స్ మరో ఎత్తు! పుష్పరాజ్ తప్ప మరొకరు ప్రేక్షకుల కళ్లకు కనిపించరు. ఇతరులు స్క్రీన్ మీద ఉన్నప్పటికీ బన్నీని తప్ప ఇంకొకరిని చూడలేం. బర్త్ డేకి సుకుమార్ బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి. 'పుష్ప 2' టీజర్‌తో రికార్డుల మాస్ జాతర మొదలు అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.
Also Read: నాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!
తగ్గేది లే... పంద్రాగస్టుకు సినిమా విడుదల!
Pushpa The Rule Movie Release Date: డిసెంబర్ 17, 2021న 'పుష్ప' ఫస్ట్ పార్ట్ విడుదల అయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా చేయలేదు. ఆయన నుంచి వేరె సినిమా ఏదీ థియేటర్లలోకి రాలేదు. అప్పటి నుంచి 'పుష్ప 2' మీద కాన్సంట్రేట్ చేశారు. సుమారు రెండేళ్లు ఈ సినిమాకు కేటాయించారు. మధ్యలో అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు నిరసనలు, సోషల్ మీడియాలో నేషనల్ ట్రెండ్స్ కూడా చేశారు.
Also Read: ఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?
ఒకానొక దశలో ఆగస్టు 15న 'పుష్ప 2' రిలీజ్ కాదని గట్టిగా ప్రచారం జరిగింది. ఆ పుకార్లకు యూనిట్ ఎప్పుడో చెక్ పెట్టింది. ఆగస్టు 15న 'పుష్ప 2' థియేటర్లలోకి సినిమా వస్తుందని స్పష్టం చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఇండియన్ లాంగ్వేజెస్ కాకుండా రష్యన్, జపనీస్, చైనీస్ భాషల్లో అనువదించే అవకాశం కూడా ఉంది.
Also Read: 'టిల్లు స్క్వేర్' సక్సెస్, గ్లామర్ రోల్ తర్వాత స్ట్రాటజీ మార్చిన అనుపమ - బ్యాక్ టు కేరళ!
'పుష్ప 2'లో బన్నీ జోడీగా శ్రీవల్లి పాత్రలో మరోసారి నేషనల్ క్రష్ రష్మికా మందన్నా సందడి చేయనున్నారు. విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఇంకా 'పుష్ప'లో కీలక పాత్రలు చేసిన జగదీశ్, సునీల్, అనసూయ సైతం 'పుష్ప 2'లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ 'పుష్ప: ది రోర్' కూడా తెరకెక్కించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.