Rajinikanth vs Dhanush: 'కూలీ' రజనీకాంత్ ఆస్తుల ఎన్ని? 'కుబేర' ధనుష్‌తో పోల్చుకుంటే ఎక్కువా? తక్కువా?
Which Properties Does Rajinikanth Own: 'కూలీ'గా వస్తున్న రజనీకాంత్ ఆస్తులు ఎంత? కుబేరా హీరో ధనుష్‌తో పోలిస్తే ఎక్కువ . ధనవంతుడెవరు?

Who is rich Rajinikanth or Dhanush: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో ఇంటర్‌నెట్‌లో చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే వందల సినిమాలు చేసిన ఆయన సంపద ఎంత, ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులు సంగతి ఏంటనే విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మిగతా కుటుంబ సభ్యులు గురించి పక్కన పెడితే తరచూ వార్తల్లో ఉంటున్న అల్లుడు ధనుష్ ఆస్తులు ఎంత, రజనీకాంత్‌తో పోల్చి చూస్తున్నారు. అందుకే వారిద్దరి వద్ద ఉన్న నికర ఆస్తులు గురించి ఇక్కడ చూద్దాం.
రజనీకాంత్ , ధనుష్ ఇద్దరూ బిగ్ స్టార్స్. 1975 నుంచి రజనీకాంత్ సినిమాల్లో నటిస్తున్నారు. ధనుష్ 2002లో సినీ రంగ ప్రవేశం చేశారు. నాటి హీరో అయినా నేటి తరంతో రజనీ పోటీ పడుతూ బాక్సాఫీస్ రేస్‌లో దూసుకెళ్తున్నారు. ధనుష్ కూడా అన్ని జోనర్ సినిమా చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరో. ఇద్దరూ కింది స్థాయి నుంచి వచ్చారు కాబట్టి వీళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాకుండా రజనీకాంత్ కుమార్తె సౌందర్యను ధనుష్ పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోవడం కలిసిపోవడం జరుగుతూనే ఉంది. ప్రస్తుతానికి విడివిడిగానే ఉంటున్నారు. ఈ మధ్య 'కుబేరా'తో మంచి హిట్ అందుకున్నారు ధనుష్. ఇప్పుడు 'కూలీ'తో రజనీ వస్తున్నారు. అందుకే ఈ ఇద్దరి నికర ఆస్తుల గురించి చర్చనీయాంశమవుతున్నాయి.
రజనీకాంత్ ఎంత సంపాదిస్తారు?
రజనీకాంత్ 1975లో సినీ కెరీర్‌ను చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించారు. క్రమంగా స్టార్ హీరోగా ఎదిగారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీన్‌ను షేక్ చేసే హిట్ సినిమాలు తీశారు. ఇప్పటికీ తీస్తూనే ఉన్నారు. అందుకే ఆయనకు ఇచ్చే పారితోషకం అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు కూడా దేశంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. ఈ క్రమంలో రజనీకాంత్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. వివిధ నివేదికలను పరిశీలిస్తే రజనీకాంత్ నికర ఆస్తి 430 కోట్లు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రజనీ ఒక్కో సినిమాకు 120 నుంచి 250 కోట్ల వరకు రెమ్యునురేషన్ తీసుకుంటారని టాక్. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో మంచి లగ్జరీ బంగ్లా కూడా ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న రేట్ల ప్రకారం ఈ బంగ్లా ధర 35 కోట్లుగా చెబుతున్నారు.
అంతేకాకుండా, రజనీకాంత్‌కు కార్లంటే చాలా ఇష్టం. రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, BMW X5, మెర్సిడెస్ బెంజ్ జి-వేగన్, లంబోర్గిని యురుస్ వంటి లగ్జరీ కార్లు బాషా ఇంటి కాంపౌండ్‌లో ఉంటాయి. రజనీకాంత్‌కు ఒక లగ్జరీ వెడ్డింగ్ హాల్ కూడా ఉంది. దీని పేరు రాఘవేంద్ర మండపం. దీని విలువ 20 కోట్లు. ఇందులో సీటింగ్ కెపాసిటీ 1000 కంటే ఎక్కువ.
View this post on Instagram
ధనుష్ నికర ఆస్తి ఎంత?
ధనుష్ విషయానికి వస్తే, GQ నివేదిక ప్రకారం నికర ఆస్తి 230 కోట్లు. ధనుష్ ఒక్కో సినిమాకు 20 నుంచి 35 కోట్లు వసూలు చేస్తారు. వీటితోపాటు కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయనికి వండర్ బార్ ఫిల్మ్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ధనుష్ మ్యూజిక్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా సంపాదిస్తారు. ధనుష్‌కు చెన్నైలో 150 కోట్ల విలువైన బంగ్లా కూడా ఉంది.





















