Bholaa Shankar Update : చిరంజీవి - ఛలే గయీ కోల్‌కతా, అంతా శంకరుడి కోసమే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భోళా శంకర్'. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఈ రోజు యమహా నగరిలో మొదలైంది.
చిరు... ఛలే గయీ యమహా నగరి
'భోళా శంకర్' కొత్త షెడ్యూల్ నేడు యమహా నగరిలో మొదలైంది. అదేనండీ... కోల్ కతాలో! 'చూడాలని ఉంది'లో 'యమహా నగరి కలకత్తా పురి' సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే. కలకత్తా నేపథ్యంలో ఎన్ని తెలుగు సినిమాలు వచ్చినా, తెలుగులో ఎన్ని పాటలొచ్చినా... ఆ పాటకు ఉండే ప్రత్యేకత వేరు. సో... యమహా నగరికి, చిరంజీవికి విడదీయరాని అనుబంధం ఉంది. అందుకని, ఆ సిటీలో షూటింగ్ అంటే మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
Also Read : తెలుగు ఓటీటీకి ఏం కావాలో చూపించిన మహి - నెక్స్ట్ ఏంటి బ్రహ్మ!?
View this post on Instagram
ఆగస్టు 11న 'భోళా శంకర్
'ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. విడుదల తేదీ మారోచ్చని ఆ మధ్య వినిపించింది. అయితే, మే డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేశారు. టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరు పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.
Also Read : 'ఏజెంట్' రిజల్ట్ మీద నాగచైతన్య రియాక్షన్ - 'కస్టడీ' డిజప్పాయింట్ చేయదు!
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. మణిశర్మ కుమారుడు, యువ సంగీత సంచలనం మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, అర్జున్ దాస్, రష్మీ గౌతమ్, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
మెగాస్టార్ సరసన కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా నటిస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య ఓ మెలోడీ షూట్ చేసినప్పటికీ... విడుదల చేశారు. సినిమాలో ఆ పాటకు కత్తెర వేశారు. తర్వాత కూడా బయటకు రానివ్వడం లేదు. సో... 'భోళా శంకర్'లో ఇద్దరు జంటగా చేసే డ్యాన్స్ ప్రేక్షకులు చూడొచ్చు.
కీర్తీ సురేష్ జోడిగా సుశాంత్?
'భోళా శంకర్' సినిమాలో చిరు సోదరి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఆమెకు జోడిగా ఏయన్నార్ మనవడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కనిపిస్తారని సమాచారం. సినిమాలో ఆయన కూడా ఉన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం'కు రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరు గుండుతో కనిపించవచ్చు. ఆ మధ్య సోషల్ మీడియాలో గుండు లుక్ పోస్ట్ చేసింది కూడా ఈ సినిమా టెస్టింగ్ లో భాగమే. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ పర్యవేక్షణ: సత్యానంద్, సంభాషణలు: తిరుపతి మామిడాల, కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్.





















