News
News
వీడియోలు ఆటలు
X

Mahi V Raghav : తెలుగు ఓటీటీకి ఏం కావాలో చూపించిన మహి - నెక్స్ట్ ఏంటి బ్రహ్మ!?

దర్శకుడు మహి వి రాఘవ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అని తెలుగు ఓటీటీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. 'సేవ్ ద టైగర్స్' సక్సెస్ తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్స్ మీద అందరి చూపు పడింది.

FOLLOW US: 
Share:

థియేటర్లలో గత వారం విడుదలైన సినిమాల కంటే ఓటీటీలో వచ్చిన 'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ (Save The Tigers Web Series) మీద ఎక్కువ మంది చూపు పడింది. దీనికి కారణం క్లీన్ కామెడీ! ఇంకా చెప్పాలంటే... మౌత్ టాక్! నిజానికి, ఓటీటీలో ఈ మధ్య వచ్చిన వెబ్ సిరీస్, సినిమాల్లో ఈ స్థాయి విజయం సాధించిన ప్రాజెక్ట్ మరొకటి లేదు.

'సేవ్ ద టైగర్స్' విజయంతో షో క్రియేటర్ అండ్ ప్రొడ్యూసర్ మహి వి. రాఘవ్ (Mahi V Raghav) నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ మీద తెలుగు ఓటీటీల్లో క్రేజ్ నెలకొంది. వై? ఎందుకు? అంటే... తెలుగు ఓటీటీకి ఏం కావాలో ఆయన చూపించారనే మాట వినబడుతోంది. ఓటీటీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు, అడల్ట్ స్టోరీస్ అని ముద్ర పడింది. తెలుగులోనూ అటువంటివి కొన్ని వచ్చాయి. అయితే, 'సేవ్ ద టైగర్స్'లో గ్లామర్ షో లేదు. ఉన్నదంతా ఫ్యామిలీ షోనే! ఎక్కడో ఒకటి ఆరా మినహా డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా లేవు. సిట్యువేషనల్ ఫన్ తప్ప సపరేట్ కామెడీ ట్రాక్స్ లేవు. దాంతో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. మహి వి రాఘవ్ అంటే రెస్పెక్ట్ & క్రేజ్ పెరిగింది.

ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే సన్నివేశాలను కథగా మలిచి మహి వి. రాఘవ్ కొత్తగా చూపించారు. అది చక్కగానూ, కొత్తగానూ ఉంది. నిజానికి, మహి వి. రాఘవ్ ఆలోచనలు చాలా కొత్తగా ఉంటాయి. సన్నివేశాన్ని ఆయన చూసే కోణమే వేరుగా, కొత్తగా ఉంటుంది. తెలుగులో హారర్ కామెడీ సినిమాలు కుప్పలు తెప్పలుగా వస్తున్న రోజుల్లో 'ఆనందో బ్రహ్మ' (Anando Brahma) తీశారు. అదీ హారర్ కామెడీ సినిమాయే! కాకపోతే... అందులో ఓ కొత్తదనం ఉంటుంది. దెయ్యాలకు మనుషులు భయపడుతు సీన్లు చూపించి అందరూ నవ్విస్తే... మనుషులను చూసి దెయ్యాలు భయపడితే? కాన్సెప్ట్ తీసుకుని మహి వి. రాఘవ్ నవ్వించారు. ఇప్పుడు 'సేవ్ ద టైగర్స్' అన్నారు. రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న సిరీస్ ఇది. దాంతో నెక్స్ట్ ఏంటి? అనే క్రేజ్ నెలకొంది. 

Also Read : 'ఏజెంట్' రిజల్ట్ మీద నాగచైతన్య రియాక్షన్ - 'కస్టడీ' డిజప్పాయింట్ చేయదు!

వైఎస్ జగన్ బయోపిక్... 'యాత్ర 2'!
'పాఠశాల'తో మహి వి రాఘవ్ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత తీసిన 'ఆనందో బ్రహ్మ' ఆయనకు విజయాన్ని, గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ రెండిటి కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మీద తీసిన బయోపిక్ 'యాత్ర' ఎక్కువ గౌరవాన్ని తెచ్చింది. దానికి కొనసాగింపుగా రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర 2' తీయాలని మహి వి. రాఘవ్ డిసైడ్ అయ్యారు. అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేను కానీ తప్పకుండా ఉంటుందని తెలిపారు. 

'సైతాన్'తో రానున్న మహి!
'సేవ్ ద టైగర్స్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది. దీని తర్వాత అదే ఓటీటీకి మహి వి. రాఘవ్ మరో ప్రాజెక్ట్ చేశారు. అదే 'సైతాన్'. ఇక్కడ ట్విస్ట్ ఏంటి? అంటే... అది కాస్త బోల్డ్ సిరీస్! అయితే... కావాలని బోల్డ్ సీన్స్ తీయలేదని, కథలో భాగంగా బోల్డ్ సీన్స్ ఉంటాయని, వాటిని వల్గర్ గా కాకుండా క్రియేటివ్ గా మహి తీశారని సమాచారం. 

Also Read రజనీకాంత్ 100% కరెక్ట్, నిజాలే మాట్లాడతారు - వైసీపీలో ఇష్యూలో జగపతి బాబు మద్దతు

Published at : 04 May 2023 09:01 AM (IST) Tags: Mahi V Raghav Save The Tigers Web Series Shaitan Disney Plus Hotstar Mahi V Raghav Next Projects

సంబంధిత కథనాలు

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో  గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్

Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్

Sai Dharam Tej - Manager Issue : సెట్‌లో గొడవ నిజమే - మేనేజర్‌ను మార్చేసిన సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej - Manager Issue : సెట్‌లో గొడవ నిజమే - మేనేజర్‌ను మార్చేసిన సాయి ధరమ్ తేజ్

టాప్ స్టోరీస్

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

Train Travel Insurance: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!