By: ABP Desam | Updated at : 04 May 2023 08:24 AM (IST)
అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య, అఖిల్
'ఏజెంట్' గురి తప్పింది! భారతీయ గూఢచారిగా నటించిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ప్యాక్డ్ బాడీ, నయా హైయిర్ స్టైల్, సరికొత్త నటనతో మెప్పించినా సరే... సినిమాను అయితే ఆడియన్స్ రిజక్ట్ చేశారు. తమ్ముడు థియేటర్లలోకి వచ్చిన రెండు వారాలకు అన్నయ్య వస్తున్నాడు.
'కస్టడీ' మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాదులో విలేకరుల సమావేశం నిర్వహించింది. అక్కినేని హీరోల వరుస ఫ్లాపుల గురించి ఆ సమావేశంలో నాగ చైతన్య స్పందించారు.
''అక్కినేని అభిమానులు మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళకు మేము తిరిగి ఇచ్చేది మంచి సినిమా మాత్రమే. అఫ్ కోర్స్... లాస్ట్ రెండు మూడు రిలీజులు మేము అనుకున్నట్టు వర్కవుట్ అవ్వలేదు. ఈ ప్రయాణంలో హిట్టు, ఫ్లాపులు సాధారణమే. అందరూ వాటిని చూశారు. వాటితో ట్రావెల్ అవ్వాలి. ఆ బ్యాడ్ టైమ్ త్వరగా పాస్ అయిపోతుంది. మేం త్వరలో విజయాలతో తిరిగి వస్తాం. నేను 'కస్టడీ' మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అభిమానులకు కావాల్సిన రిజల్ట్ రాబోతుందని బాగా నమ్ముతున్నాను'' అని నాగ చైతన్య చెప్పారు. అభిమానులను 'కస్టడీ' డిజప్పాయింట్ చేయదని ఆయన అన్నారు.
మే 5న 'కస్టడీ' ట్రైలర్!
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న 'కస్టడీ' (Custody Movie)లో నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించారు. మే 5న చెన్నైలో సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
Also Read : రజనీకాంత్ 100% కరెక్ట్, నిజాలే మాట్లాడతారు - వైసీపీలో ఇష్యూలో జగపతి బాబు మద్దతు
తెలుగు, తమిళ భాషల్లో 12న విడుదల!
నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. మే 12న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.
ఒక్క పాటకు ఏడు సెట్స్!
'కస్టడీ'లో సాంగ్ షూటింగ్ కోసం వెంకట్ ప్రభు ఏడు సెట్స్ వేయించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో పాటకు అన్ని సెట్స్ వేయించడం అరుదు. నాగ చైతన్య, కృతి శెట్టిపై ఆ సాంగ్ తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ బ్లాక్ బస్టర్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!
నాగ చైతన్య ఇంతకు ముందు కొన్ని మాస్ సినిమాలు చేశారు. అయితే, 'కస్టడీ'లో మాత్రం ఆయన యాక్షన్ కొత్తగా ఉండబోతుందని గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ వీడియో నిడివి పెద్దగా లేదు. జస్ట్ 26 సెకన్లు. అందులో విజువల్స్ నిడివి ఇంకా తక్కువ. అయితేనేం? సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోందనేది వెంకట్ ప్రభు చూపించారు.
Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?
Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి
Nawazuddin Siddiqui: లీడ్ యాక్టర్స్‌తో కలిసి తింటుంటే, కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు - నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?