By: ABP Desam | Updated at : 03 May 2023 12:18 PM (IST)
తమిళ నటి షాలిని (Image Courtesy : shalu2626 / Instagram)
తమిళ నటి షాలిని అంటే మెజారిటీ ప్రేక్షకులకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య గుర్తుకు రావడం సహజం. ఆమె తర్వాత వచ్చిన షాలిని అంటే విజయ్ దేవరకొండ సరసన 'అర్జున్ రెడ్డి' సినిమాలో నటించిన షాలిని పాండే కొంత మందికి గుర్తుకు రావచ్చు. ఎట్ ప్రజెంట్... ఇప్పుడు అయితే మాత్రం గుర్తుకు వచ్చే పేరు, సీరియల్ ఆర్టిస్ట్ షాలిని మాత్రమే!
వైరల్ విడాకుల ఫోటో షూట్...
ఇలా కూడా సెలబ్రేట్ చేస్తారా?
తమిళ సీరియల్ 'ముల్లుమ్ మలరుమ్'లో షాలిని నటించారు. తర్వాత 'సూపర్ మామ్' అని ఓ షో చేశారు. తమిళనాడులో ఆ సీరియల్, షోస్ ఆమెకు ఎంత గుర్తింపు తీసుకు వచ్చిందో తెలియదు కానీ... ఇప్పుడు ఏకంగా ఇండియా అంతా ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది డివోర్స్ ఫోటో షూట్!
షాలినికి 2020లో వివాహం అయ్యింది. ఆమె భర్త... సారీ, ఇప్పుడు మాజీ భర్త కదూ! ఆయన పేరు రియాజ్. వీళ్ళకు ఓ పాప కూడా ఉంది. మూడేళ్ళ వైవాహిక జీవితం అనంతరం ఇద్దరూ వేరు పడాలని నిర్ణయించుకున్నారు. డివోర్స్ తీసుకున్నారు. అయితే, విడాకులను షాలిని వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి ఫోటోను చింపేస్తూ... ఫోటో షూట్ చేశారు. అది వైరల్ అయ్యింది. 'నాకు 99 సమస్యలు ఉన్నాయి. భర్త ఒక్కటే నా ప్రాబ్లమ్ కాదు' అని రాసి ఉన్న కొటేషన్ షాలిని పట్టుకోవడం కూడా వైరల్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే... ఈమె ఫోటోలే చక్కర్లు కొడుతున్నాయి. ఫోటో షూట్ చేయడమే కాదు... మహిళలకు షాలిని ఓ సందేశం కూడా ఇచ్చారు.
విడాకులు తీసుకోవడం తప్పేమీ కాదు!
''సంతోషంగా ఉండటం ముఖ్యం... అందుకని, బ్యాడ్ మ్యారేజ్ (వైవాహిక బంధం వర్కవుట్ కాకపోతే, దాని) నుంచి వైదొలగడం తప్పేమీ కాదు. మన జీవితాన్ని మన కంట్రోల్ లోకి తీసుకోవాలి. మంచి భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం మారడం కూడా ముఖ్యమే. విడాకుల తీసుకోవడం ఫెయిల్యూర్ ఏమీ కాదు. జీవితంలో అది ఒక టర్నింగ్ పాయింట్. మన జీవితంలో సానుకూల మార్పులకు మొదలు. వైవాహిక బంధం నుంచి బయటకు రావడానికి (విడాకులు తీసుకోవడానికి) చాలా ధైర్యం కావాలి. ధైర్యవంతులైన మహిళలు అందరికీ నేను ఈ ఫోటో షూట్ అంకితం ఇస్తున్నా'' అని షాలిని పేర్కొన్నారు.
పబ్లిసిటీ కోసం ఫోటోషూట్ చేయలేదు...
ఇప్పట్లో ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వను!
ఫోటో షూట్ వైరల్ కావడంతో ఈ రోజు సోషల్ మీడియాలో షాలిని మరో పోస్ట్ చేశారు. తన ఫోటో షూట్ మీద ఆసక్తి చూపించిన వారందరికీ థాంక్స్ చెప్పారు. అదే సమయంలో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తాను రెడీగా లేనని కూడా స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసం ఆ ఫోటో షూట్ చేయలేదన్నారు. తన లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న మహిళలు అందరికీ సందేశం ఇవ్వడం కోసమే ఆ ఫోటో షూట్ అని పేర్కొన్నారు. అదీ సంగతి! కొత్తగా వచ్చిన గుర్తింపుతో రాబోయే రోజుల్లో షాలిని ఏం చేస్తారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?
WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్