Baahubali The Epic Teaser - 'బాహుబలి ది ఎపిక్' టీజర్ రెడీ... పంద్రాగస్టుకు ఆ రెండు సినిమాలతో పాటు థియేటర్లలోకి!
Baahubali The Epic Teaser Release: రెండు భాగాలుగా విడుదలైన 'బాహుబలి'ని ఒక్కటి చేసి 'బాహుబలి: ది ఎపిక్'గా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ టీజర్ త్వరలో విడుదల కానుంది.

'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్'... రెండు సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ బరిలో ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఆ రెండిటిలో మొదటి సినిమా విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో రెండు భాగాలను ఓ సినిమాగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా టీజర్ రెడీ అయ్యింది.
'బాహుబలి: ది ఎపిక్' టీజర్ రెడీ!
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాట్ సినిమా పనులు చూసుకుంటూ మరొక వైపు 'బాహుబలి: ది ఎపిక్' ఎడిటింగ్ వర్క్స్ సైతం చూస్తున్నారు రాజమౌళి. ఇప్పుడు ఆ పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. సినిమా టీజర్ కూడా రెడీ చేశారట.
'వార్ 2', 'కూలీ'తో ఎపిక్ టీజర్ రిలీజ్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన 'వార్ 2' ఆగస్టు 14న విడుదల అవుతోంది. ఆ రోజునే సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన 'కూలీ' రిలీజ్ కూడా! ఆ రెండు సినిమాలతో 'బాహుబలి: ది ఎపిక్' టీజర్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిసింది.
అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' రిలీజ్!
Baahubali The Epic Release Date 2025: అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' థియేటర్లలోకి రానుంది. రాజమౌళి ఏయే సన్నివేశాలకు కత్తెర వేస్తారు? ఎంత నిడివితో సినిమా విడుదల చేస్తారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. రీ రిలీజ్ ట్రెండ్ అందరికీ తెలుసు... రెండు భాగాలను ఒక్కటిగా విడుదల చేసే కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు రాజమౌళి. దాంతో సినిమాకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీని తర్వాత డిసెంబర్ 5న 'ది రాజా సాబ్'తో ప్రభాస్ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ సినిమా సంక్రాంతికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?




















