Mahesh Babu: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు - సమాధానాలు తెల్సా?
Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా Google తల్లిని నెటిజన్స్ ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఏమిటి? ఆయా ప్రశ్నలకు సమాధానాలు ఏమిటి? తెలుసుకోండి.

Answers to most googled questions about Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలుసు. ఆయన చేసే ప్రతి సినిమా, ఛారిటీ వర్క్స్ గురించి అప్ టు డేట్ తెలుస్తుంది. ఇప్పుడు మహేష్ టాలీవుడ్ హీరో కాదు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29తో పాన్ వరల్డ్ స్టార్ కాబోతున్నారు. మరి, ఆయన గురించి గూగుల్ తల్లిని ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఏమిటి? వాటికి సమాధానాలు ఏమిటి? తెలుసుకోండి.
మహేష్ బాబు వయసు ఎంత?
Mahesh Babu Age: మహేష్ బాబు వయసు గురించి ఎక్కువ మంది నెటిజనులు గూగుల్ సెర్చ్ చేశారు. ఆయన అందం అటువంటిది మరి. వయసు పెరిగే కొలదీ యంగ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆయన వయసు 50 ఏళ్ళు. ఆగస్టు 9, 1975లో మహేష్ బాబు జన్మించారు. ఈ ఏడాదితో ఆయనకు 50 ఏళ్ళు నిండుతాయి.
భార్య ఎవరు? ఆమె వయసెంత?
What is the age gap between Mahesh Babu and his wife Namrata: మహేష్ వయసు మాత్రమే కాదు... ఆయన భార్య ఎవరు? ఆవిడ వయసు ఎంత? భార్యకు, మహేష్ బాబుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? వంటి ప్రశ్నలు సైతం కొందరు నెటిజనులు గూగుల్ తల్లిని అడిగారు. అందుకు ఓ కారణం ఉంది. అది ఏమిటంటే... జనవరి 22, 1972లో నమ్రత జన్మించారు. మహేష్ కంటే ఆమె మూడేళ్లు పెద్ద. అందుకని వాళ్ళిద్దరి ఏజ్ గ్యాప్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు.
Mahesh Babu daughter age: మహేష్ కుమార్తె సితార ఘట్టమనేని వయసు గురించి కూడా కొందరు సెర్చ్ చేయడం గమనార్హం. జూలై 20, 2012లో సితార జన్మించింది. ఈ ఏడాది (2025)కి ఆమె వయసు 13 ఏళ్ళు. మహేష్ కుమారుడు గౌతమ్ పుట్టినరోజు ఆగస్టు 31, 2006.

నమ్రతతో మహేష్ ప్రేమలో ఎలా పడ్డారు?
How Did Mahesh Babu fall in love: మహేష్ - నమ్రతా శిరోద్కర్ ఏజ్ గ్యాప్ తర్వాత వాళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారనే సందేహం చాలా మందిలో కలగడం సహజం. ఆ కారణం చేత వాళ్ళ ప్రేమ కథ గురించి సెర్చ్ చేశారు. 'వంశీ'లో వాళ్లిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా చేసే సమయంలో మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. 'వంశీ' సినిమా 2000లో విడుదల అయితే ఐదేళ్ల తర్వాత 2025లో తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. మెడలో మూడు ముళ్ళు పడిన తర్వాత నమ్రత సినిమాలు చేయలేదు. భర్తకు ఇష్టం లేదని కెమెరా ముందుకు రావడం మానేశారు. పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకోవడంతో పాటు మహేష్ ఛారిటీ కార్యక్రమాలు ఆమె దగ్గరుండి చూసుకుంటారు.
మహేష్ బాబు ఏం చదివారు? డిగ్రీ ఉందా?
What was Mahesh Babu's degree: మహేష్ బాబు ఏజ్, లవ్ & మ్యారీడ్ లైఫ్ తర్వాత ఆయన గురించి నెటిజనులు సెర్చ్ చేసిన విషయాల్లో అకడమిక్ టాపిక్ ఉంది. బాలనటుడిగా మహేష్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ... చదువును అశ్రద్ధ చేయలేదు. చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి కామర్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
Also Read: రాఖీ స్పెషల్: బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ తెలుగు ఫిలిమ్స్
మహేష్ బాబు దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయ్?
What car does Mahesh Babu drive?: ఏ కారులో మహేష్ బాబు ప్రయాణిస్తారు? ఆయన దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి? డ్రైవ్ చేసేది ఏది? తెలుసుకోవాలని నెటిజనులు ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ ఎక్కువగా రేంజ్ రోవర్ కారులో వెళతారు. దాని ఖరీదు సుమారు 2 కోట్లు.
How many cars has Mahesh Babu: మహేష్ దగ్గర మొత్తం నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. రేంజ్ రోవర్ సహా రూ. 1.10 కోట్లు విలువ చేసే ఆడి ఏ8, కొట్టిన్నర ఖరీదు చేసే టయోటా ల్యాండ్ క్రూజర్, బీఎండబ్ల్యూ ఉన్నాయట. మహేష్ కేర్‌వ్యాన్ ఖరీదు ఆరు కోట్ల రూపాయలట.
Also Read: చంద్రబాబును ప్రేమించిన హీరోయిన్... ఆ అమ్మాయి ఎవరు? 'మయసభ'పై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి





















