Raksha Bandhan Movies - రాఖీ స్పెషల్: బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ తెలుగు ఫిలిమ్స్
Ten Best Telugu Movies On Brother and Sister Sentiment movies: బ్రదర్ & సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ ఫిలిమ్స్ తెలుసా? ఈ రాఖీ పండక్కి ఫ్యామిలీతో చూడండి.

భారతీయులు బంధాలు - బంధుత్వాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందులోనూ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజలూ రక్త సంబంధానికి, ముఖ్యంగా తోబుట్టువులకు ఎక్కువ విలువ ఇస్తారు. రాఖీ సందర్భంగా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 10 బెస్ట్ మూవీస్ లిస్ట్ ఇది. పండక్కి ఫ్యామిలీతో కలిసి చూడండి.
ఎన్టీఆర్ 'రాఖీ'... ఎవర్‌గ్రీన్!
రాఖీ పండగ ఉన్నన్ని రోజులూ తెలుగు ప్రజలకు గుర్తుండే సినిమా 'రాఖీ'. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. అదనపు కట్నం కోసం చెల్లెల్ని వేధించడంతో పాటు సజీవ దహనం చేయడం వల్ల కోపంతో రగిలిన ఓ అన్న... ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సమాజంలో చీడ పురుగుల్ని, మహిళలను లైంగికంగా వేధించిన వాళ్ళను ఏం చేశాడనేది కథ. దర్శకుడు కృష్ణవంశీ భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. మనసుల్ని కదిలించే చిత్రమిది.
మహేష్ 'అర్జున్'... మెమరబుల్!
బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమా 'అర్జున్'. ఇందులో హీరోకి ట్విస్ట్ సిస్టర్ (కీర్తి రెడ్డి) ఉంటుంది. ఆమె ప్రేమ వివాహం చేసుకుంటుంది. అయితే వేరొక సంబంధం చేసుకుంటే కోట్ల ఆస్తి తమకు వస్తుందని కోడల్ని చంపేయడానికి అత్తమామలు ప్లానులు వేస్తారు. అది తెలిసిన అర్జున్, సోదరిని కాపాడుకోవడానికి ఏం చేశారనేది కథ. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకులు. సినిమా కోసం వేసిన మీనాక్షి టెంపుల్ సెట్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్.
పవన్ 'అన్నవరం'... మరువలేం!
అన్నయ్యా అన్నావంటే ఎదురవనా... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అన్నవరం'లో సాంగ్. పాటలో మాత్రమే కాదు... సినిమాలోనూ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఓ క్యాంటీన్ విషయంలో బావా (చెల్లెలి భర్త)కు ప్రమాదం ఉందని తెలుసుకున్న అన్నయ్య... హైదరాబాద్ సిటీలో రౌడీలు అందర్నీ పైలోకాలకు పంపించేయడం కథ.
చిరంజీవి 'హిట్లర్'... బ్లాక్ బస్టర్!
సిస్టర్ సెంటిమెంట్ మూవీస్ అంటే మెగా అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా 'హిట్లర్'. ఒకరిద్దరు కాదు... ఇందులో హీరోకి ఏకంగా ఐదుగురు చెల్లెళ్ళు ఉంటారు. చిన్నతనంలో తల్లిని కోల్పోయినప్పటికీ, తండ్రి జైలుకు వెళ్లినప్పటికీ... చెల్లెళ్లకు ఎటువంటి లోటు రాకుండా పెంచుతాడు అన్నయ్య. తమకు ఎంతో చేసిన అన్నయ్యను చెల్లెళ్ళు ఎందుకు ద్వేషించారు? చివరకు ఎలా కలిశారు? అనేది కథ. ఎమోషనల్ మూవీ ఇది. మెగాస్టార్ నటన కంటతడి పెట్టిస్తుంది.
రాజశేఖర్ 'గోరింటాకు'... హిట్టు సార్!
బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలోని కథతో హిట్టు అందుకున్న హీరోల్లో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సైతం ఉన్నారు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా 'గోరింటాకు'. రాజశేఖర్ సిస్టర్ పాత్రలో మీరా జాస్మిన్ నటించారు. కుటుంబ ప్రేక్షకుల మనసులను కదిలించే భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమిది. చెల్లెలి ఆత్మహత్య తెలిసిన తట్టుకోలేక మరణించిన ఓ అన్నయ్య కథ 'గోరింటాకు'.
Also Read: టాలీవుడ్‌కు మరో ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికాడు... చైతన్యకు క్యారెక్టర్లు రాయొచ్చు
అర్జున్ 'పుట్టింటికి రా చెల్లి'... చూడాలి!
యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమా 'పుట్టింటికి రా చెల్లి'. చెల్లెలి సంతోషం కోసం అన్నయ్య ఎటువంటి త్యాగం చేశాడనేది కథ. ఈతరం ప్రేక్షకులకు తెలియని సినిమా. కానీ, మనసుల్ని కదిలించే సినిమా.
సీనియర్ ఎన్టీఆర్ 'రక్త సంబంధం', ఏయన్నార్ 'బంగారు గాజులు', శోభన్ బాబు 'చెల్లెలి కాపురం', బాలకృష్ణ 'ముద్దుల మావయ్య', నందమూరి హరికృష్ణ - జగపతి బాబుల 'శివ రామరాజు', రామ్ చరణ్ 'బ్రూస్ లీ', నాని - ఎస్‌జే సూర్య 'సరిపోదా శనివారం' సినిమాల్లోనూ సిస్టర్ సెంటిమెంట్ బావుంటుంది. రాఖీ రోజు ఫ్యామిలీతో కలిసి, ముఖ్యంగా బ్రదర్ & సిస్టర్స్ కలిసి చూడదగ్గ సినిమాలు ఇవి.
Also Read: చంద్రబాబును ప్రేమించిన హీరోయిన్... ఆ అమ్మాయి ఎవరు? 'మయసభ'పై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి





















