Aus vs Eng 1st Test Highlights: ట్రావిస్ హెడ్ ఫాస్టెస్ట్ సెంచరీ.. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం
Travis Head Fastest Century | ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లాండ్ ఓటమితో ప్రారంభించింది. హెడ్ మెరుపు శతకం చేయడంతో 8 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

Australia vs England, 1st Test | యాషెస్ 2025-26 సిరీస్ తొలి టెస్ట్ ఉత్కంఠభరితంగా జరిగింది. స్వల్ప స్కోరు నమోదైన టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. దాంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేలా వేగంగా 123 పరుగులు చేసి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లోనే ముగిసింది.
ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో కేవలం 69 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరపున నాలుగో అత్యంత వేగవంతమైన శతకం కావడం విశేషం. ఆస్ట్రేలియాకు రెండో ఇన్నింగ్స్ (మ్యాచ్ నాలుగో ఇన్నింగ్సులో)లో 205 పరుగులు లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగింది. విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ 83 బంతుల్లో 123 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. నాల్గవ ఇన్నింగ్స్‌లో ఛేజ్ చేస్తూ హెడ్ టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. తద్వారా ఆసీస్ జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. జాక్ వెడ్రాల్డ్ 23 పరుగులు, ఫామ్ కోసం చూస్తున్న మార్నస్ లాబుషేన్ కూడా 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు.
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లాండ్
Making the 𝙃𝙚𝙖𝙙-lines and how! 🔥
— SunRisers Hyderabad (@SunRisers) November 22, 2025
Travis Head | #PlayWithFire | #AUSvENG pic.twitter.com/twvUynE1Cu
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది, అయితే ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా కం బ్యాక్ చేస్తూ ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్‌కు 40 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చారు. ఈ పిచ్‌లో ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో ఆస్ట్రేలియాకు నాల్గవ ఇన్నింగ్స్‌లో 205 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఈ టెస్టులో తొలి 3 ఇన్నింగ్స్‌ల పరిస్థితిని చూస్తే, ఈ టార్గెట్ చాలా పెద్దదిగా అనిపించింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ట్రావిస్ హెడ్ 69 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేయడంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. అయితే టెస్ట్ 4వ ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును హెడ్ తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ మిచెట్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ENG ఫస్ట్ ఇన్నింగ్స్ 172
రెండో ఇన్నింగ్స్ 164
AUS ఫస్ట్ ఇన్నింగ్స్ 132
రెండో ఇన్నింగ్స్ 205/2





















