Rama Rajamouli: రమా రాజమౌళి to కమెడియన్ సత్య... 'అమృతం' సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి టాప్ స్టార్స్‌గా మారిన సెలిబ్రిటీలు వీళ్లే
తెలుగు సీరియల్స్‌లో అమృతం ట్రెండ్ సెట్టర్. అది ఎంతో మంది యాక్టర్స్, టెక్నీషియన్లకు లైఫ్ ఇచ్చింది. ఈ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన చాలా మంది ఇప్పుడు టాప్ పొజిషన్స్‌లో ఉన్నారు. వారు ఎవరంటే?

'అమృతం' (Amrutham Serial) తెలుగు సీరియల్స్‌లో ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సీరియల్ 2001లో మొదలైన ఆరేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందును అందించింది. సీరియల్స్ అంటే కన్నీళ్లు, కష్టాలు, సెంటిమెంట్స్ మాత్రమే కాదు కడుపుబ్బా నవ్విస్తాయని 'అమృతం' నిరూపించింది. అమృతం, అంజి, అప్పాజీ, సర్వం పాత్రలను సీరియల్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. 'అమృతం' సూపర్ హిట్ కావడంతో కామెడీ కథలతో తెలుగులో చాలా సీరియల్స్ వచ్చాయి. కానీ ఈ సీరియల్‌ను మాత్రం బీట్ చేయలేకపోయాయి.
'అమృతం'తో కెరీర్ స్టార్ట్ చేసిన టాప్ స్టార్స్!
'అమృతం' సీరియల్‌కు గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. ఈ సీరియల్ ద్వారా ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. ఈ సీరియల్‌లో నటించిన కొందరు యాక్టర్స్ ఇప్పుడు టాప్ స్టార్స్‌గా కొనసాగుతోన్నారు. టెక్నీషియన్లు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఆ యాక్టర్స్, టెక్నీషియన్లు ఎవరంటే?
- రమా రాజమౌళి... దిగ్గజ దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళి 'అమృతం' సీరియల్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో నటించారు. ఈ సీరియల్ డైరెక్టర్ గుణ్ణం గంగరాజుతో ఉన్న బంధుత్వంతో ఈ సీరియల్‌లో నటించడానికి రమా రాజమౌళి అంగీకరించారు. న్యూస్ రీడర్‌గా, హోమ్ మేకర్‌గా ఇలా డిఫరెంట్ రోల్స్ చేశారు.
- కమెడియన్ సత్య... ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ కమెడియన్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఆయన 'అమృతం' సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అంతే కాదు కొన్ని ఎపిసోడ్స్‌లో యాక్టర్‌గా నటించారు కూడా. మరో కమెడియన్ శ్రీనివాస రెడ్డి కూడా నటుడిగా కొన్ని ఎపిసోడ్స్‌లో తళుక్కున మెరిశారు.
- 'బాహుబలి' సహా రాజమౌళి పలు సినిమాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కెరీర్ కూడా 'అమృతం' సీరియల్‌తోనే మొదలైంది. సీరియల్‌కు చాలా కాలం పాటు కెమెరామెన్‌గా పని చేశారు సెంథిల్ కుమార్. 'అమృతం' సీరియల్‌లోని ఫస్ట్ పది ఎపిసోడ్స్‌కు టాలీవుడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించారు. ఆ టైమ్‌లోనే చంద్రశేఖర్ ఏలేటి, సెంథిల్ మంచి ఫ్రెండ్సయ్యారు. ఆ పరిచయంతోనే చంద్రశేఖర్ ఏలేటి తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'ఐతే'కు సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్ కుమార్‌కు ఛాన్స్ ఇచ్చారు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?
- 'మగధీర', 'గేమ్ ఛేంజర్', 'ఈగ', 'రాధే శ్యామ్' వంటి భారీ బడ్జెట్ సినిమాలకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన ఎస్ రవీందర్ సినీ జర్నీ కూడా అమృతం సీరియల్‌తోనే ప్రారంభం కావడం గమనార్హం. 'అమృతం' సీరియల్‌తో సంగీత దర్శకుడిగా పరిచయమైన కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్... ఆ తర్వాత 'ఆంధ్రుడు', 'అష్టా చమ్మా', 'ఊహలు గుసగుసలాడే' లాంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. వీరే కాకుండా నరేష్, శివాజీరాజా, హర్షవర్ధన్, నర్సింగ్ యాదవ్... ఇలా అమృతం సీరియల్స్‌లో నటించిన సినిమా స్టార్స్ లిస్ట్ పెద్దదే.
Also Read: రాజమౌళి సినిమాలో మహేష్ ప్రీ లుక్కు... బాబు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే అప్డేటు





















