Nagababu : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - నాగబాబు ఆన్ ఫైర్... అది చెప్పడానికి మీరెవరు? అంటూ...
Sivaji Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై సీనియర్ హీరో శివాజీ కామెంట్స్ దుమారం ఇంకా చల్లారలేదు. తాజాగా ఈ అంశంపై నటుడు, జనసేన నేత నాగబాబు రియాక్ట్ అయ్యారు.

Nagababu Reaction On Actor Sivaji Comments On Heroines Dressing Sense : గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే హాట్ టాపిక్. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై హీరో శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆయన క్షమాపణలు సైతం చెప్పారు. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు శివాజీ కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అది వారి వ్యక్తిగత హక్కు'
మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం తప్పు కాదని... మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని అన్నారు నాగబాబు. హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌ను తప్పుబడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. 'జనసేన కార్యకర్తగా కాదు. ఎమ్మెల్సీగా కాదు. నటుడిగా కాదు. ఓ సాధారణ మనిషిగా నేను మాట్లాడుతున్నా. ఆడపిల్లల వస్త్రధారణపై చాలామంది కామెంట్స్ చేశారు. ప్రతీ ఒక్కరూ ఆడపిల్లలు ఎలా ఉండాలి? వారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారు.
ఇది రాజ్యాంగ విరుద్ధం. ఆడపిల్ల ఇదే డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేందుకు మీకు ఏం రైట్ ఉంది? ఇలా మాట్లాడిన వారికి కూడా ఆడవాళ్ల నుంచి సపోర్ట్ లభించడం దురదృష్టం. ప్రతీ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుంది. అందరూ మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి అలా ఉండాలి అని చెప్పే రైట్ మనకు లేదు.' అని అన్నారు.
వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. Moral policing is against the Constitution.
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 27, 2025
Moral policing is unconstitutional in India. Courts have repeatedly held that it violates fundamental rights such as liberty, dignity, privacy, and equality guaranteed under Articles 14, 19, and 21… pic.twitter.com/t927DNMnNV
Also Read : 'వానర' కాదు 'వనవీర' - రిలీజ్‌కు ముందు టైటిల్ మారింది... ట్రైలర్ చూశారా?
'అది మగాడి క్రూరత్వం'
ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలి లేకుంటే వాళ్లను తప్పుగా ఎలా ట్రీట్ చేస్తారు? అని ప్రశ్నించారు నాగబాబు. 'ఆడపిల్లల మీద జరిగే వేధింపులు వాళ్లు వేసుకునే డ్రెస్సుల మీద కాదు. మగవాడి క్రూరత్వం, మగవాడి పశు బలం. ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అది సెలబ్రిటీలైనా బయటకు వెళ్లేటప్పుడు వ్యక్తిగతంగా సరైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. దుర్మార్గులున్న మగజాతి ఉన్న సమాజం మనది.
మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో అదే వేసుకుంది. కానీ చెడ్డ పనులు చేయకూడదు. అది చెప్పాలి మీరు. అంతే తప్ప ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అనే హక్కు మనకు లేదు. డ్రెస్సింగ్ సెన్స్ ఆ కల్చర్ బట్టి మారుతుంటుంది. ఇది వారి తప్పు కాదు. ఆడవాళ్లకు సరిగ్గా రక్షణ కల్పించలేని ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. మనం AIలోకి వచ్చాం. ఇంకా ఆడపిల్లలు ఇలా ఉండాలనే మనస్తత్వాలను ఖండించాలి. ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడూ బాగుపడలేదు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా నా వాయిస్ ఓపెన్ చేయకుంటే తప్పు చేసిన వాడిని అవుతా.' అని అన్నారు. ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వాలని... రక్షణ కల్పించుకోవాలని చెప్పాలని... అంతే తప్ప డ్రెస్సింగ్ సెన్స్‌పై కామెంట్స్ సరికాదని నాగబాబు ఫైరయ్యారు. అలాంటి దుర్మార్గమైన ఆలోచనలకు కొందరు స్త్రీలే సపోర్ట్ చేయడం తనకు బాధ కలిగిస్తుందని చెప్పారు.






















