అన్వేషించండి

జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు

2026 జనవరి 1 నుంచి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కొన్ని వేల రూపాయలు పెరుగుతాయి. రిజ్టా, 450 సిరీస్‌ కొత్త ధరలు, పెంపు కారణాలు, డిసెంబర్ ఆఫర్లు వివరాలు తెలుసుకోండి.

Ather Electric Scooter Price Hike From January: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తక్కువ కాలంలోనే ఫేమస్‌ అయిన తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ నుంచి, కొత్త సంవత్సరం ముందే ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. 2026 జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను రూ.3,000 వరకు పెంచుతున్నట్లు ఈ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ధరల పెంపు ఏథర్ విక్రయిస్తున్న అన్ని మోడళ్లకు వర్తిస్తుంది.

ముడి పదార్థాల ధరల పెరుగుదల, ఫారెక్స్ ఒత్తిడి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ భాగాల ధరలు పెరగడం వంటి అంశాలను ఈ నిర్ణయానికి కారణంగా ఏథర్ వెల్లడించింది. స్కూటర్‌లో ఎలాంటి మార్పులు చేయకపోయినా, తయారీ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది.

డిసెంబర్‌లో కొనుగోలు చేస్తే లాభం        

ధరల పెంపు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుండటంతో, డిసెంబర్ నెలను ఏథర్ ఒక మంచి అవకాశంగా చూపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఎలక్ట్రిక్ డిసెంబర్’ ఆఫర్ కింద, ఎంపిక చేసిన నగరాల్లో రూ.20,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో క్రెడిట్ కార్డ్ EMI డిస్కౌంట్లు, నగదు ప్రోత్సాహకాలు, అలాగే కొన్ని మోడళ్లకు 8 సంవత్సరాల ఉచిత బ్యాటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఉంది.

Ather Rizta కొత్త ధరలు

ఏథర్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్ ఏథర్ రిజ్టా. ఇది S, Z అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

ప్రస్తుతం Rizta S ధర రూ.1,14,546 (ఎక్స్‌-షోరూమ్‌) కాగా, ధర పెంపు తర్వాత ఇది సుమారు రూ.1,17,546 (ఎక్స్‌-షోరూమ్‌) అవుతుంది.

Rizta  Z ప్రస్తుతం రూ.1,34,047 (ఎక్స్‌-షోరూమ్‌) కాగా, కొత్త ధర రూ.1,37,047 (ఎక్స్‌-షోరూమ్‌) ఉండనుంది.       

Ather 450 సిరీస్‌ ధరల వివరాలు      

Ather 450S ప్రస్తుతం రూ.1,22,889 (ఎక్స్‌-షోరూమ్‌) వద్ద లభిస్తోంది. జనవరి నుంచి ఇది రూ.1,25,889 (ఎక్స్‌-షోరూమ్‌) వరకు చేరుతుంది.

Ather 450X ధర ప్రస్తుతం రూ.1,50,046 (ఎక్స్‌-షోరూమ్‌). ధర పెంపు తర్వాత ఇది రూ.1,53,046 (ఎక్స్‌-షోరూమ్‌) అవుతుంది.

ఫ్లాగ్‌షిప్ మోడల్ Ather 450 Apex ప్రస్తుతం రూ.1,82,946 (ఎక్స్‌-షోరూమ్‌) వద్ద లభిస్తోంది. కొత్త సంవత్సరం నుంచి దీని ధర రూ.1,85,946 (ఎక్స్‌-షోరూమ్‌)కు చేరనుంది.               

కొనుగోలుదారులపై ఇది ఎంత ప్రభావం చూపుతుంది?

రూ.3,000 ధర పెంపు పెద్ద షాక్‌లా అనిపించకపోయినా, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది కొంతమందికి ఆలోచనకు దారి తీసే అంశమే. అందుకే ఏథర్ ఫైనాన్సింగ్ ఎంపికలు, EMI సౌలభ్యాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది.

2026లో ఏథర్ స్కూటర్ కొనాలనుకునేవారు డిసెంబర్‌లోనే బుక్ చేసుకుంటే డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది. లేదంటే, జనవరి నుంచి కొంచెం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.         

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.         

టాప్ హెడ్ లైన్స్

Kawasaki Z650 కంటే రూ.33,000 అదనపు ధరకు Kawasaki Z650 Sలో ఏం ఉంది? రెండు మోడళ్ల కంపారిజన్‌
Kawasaki Z650 vs Z650 S: ధరలో తేడా ఎంత? కొత్త మోడల్‌లో వచ్చిన మార్పులేంటి?
Force e-Traveller: ఫోర్స్‌ మోటార్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ట్రావెలర్స్‌, అంబులెన్స్‌.. తుది పరీక్షల్లో EVలు
Force Motors ట్రావెలర్‌ EVలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. ఎలక్ట్రిక్ అంబులెన్స్ కూడా!
ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 478km వరకు ప్రయాణం!
లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లేవాళ్ల కోసమే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కార్లు.. కనీసం 400km రేంజ్‌ గ్యారెంటీ!
BMW F 450 GS లో Base నుంచి GS Trophy వరకు నాలుగు వేరియంట్లు.. ఏ వేరియంట్‌ బెటర్‌?
BMW అడ్వెంచర్ బైక్ F 450 GSలో 4 వేరియంట్లు.. ఏ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Embed widget