Selfish Movie Launch: ధనుష్ క్లాప్‌తో ప్రారంభమైన ఆశిష్ 'సెల్ఫీ'
నిర్మాత శిరీష్ కుమారుడు, 'దిల్' రాజు ఫ్యామిలీ నుంచి కథానాయకుడిగా వచ్చిన ఆశిష్ రెండో సినిమా ప్రారంభం అయ్యింది.
'రౌడీ బాయ్స్'తో ఆశిష్ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆయన. హీరోగా తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు రెండో సినిమా 'సెల్ఫిష్'కు శ్రీకారం చుట్టారు.
ఆశిష్ హీరోగా విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమా 'సెల్ఫిష్'. ఈ చిత్రానికి 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా ఘనంగా ప్రారంభమైంది. హీరో మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... హీరో ధనుష్ క్లాప్ ఇచ్చారు. మరో దర్శకుడు అనిల్ రావిపూడి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
'దిల్' రాజు మాట్లాడుతూ "మా ఆశిష్ 'రౌడీ బాయ్'తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు రెండో సినిమా స్టార్ట్ చేశాం. సుకుమార్, నేను 'ఆర్య' సినిమాకు పని చేశాం. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. 'ఆర్య' తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు 'సెల్ఫిష్'కు పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఐడియా విన్నప్పుడు బాగా నచ్చింది. మనం సినిమా చేద్దామని కాశీకి చెప్పా. 'రౌడీ బాయ్స్' విడుదలకు ముందు నుంచి 'సెల్ఫిష్' స్క్రిప్ట్ వర్క్ చేశాం" అని చెప్పారు.
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే. మేయర్, సాహిత్యం: చంద్రబోస్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి.
Also Read: మిస్టర్ అండ్ మిస్సెస్ రణ్ బీర్ కపూర్ - అలియా భట్ పెళ్లి ఫొటో చూశారా?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.