Alia Ranbir First Wedding Pic: మిస్టర్ అండ్ మిస్సెస్ రణ్ బీర్ కపూర్ - అలియా భట్ పెళ్లి ఫొటో చూశారా?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియాభట్-రణబీర్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

FOLLOW US: 

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియాభట్-రణబీర్ కపూర్ ల వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గురువారం (ఏప్రిల్ 14)న రణబీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తు బిల్డింగ్ లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌, కరణ్‌ జోహార్‌, ఆకాష్‌ అంబానీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహం చాలా సీక్రెట్ గా జరిగింది. 

పెళ్లి జరిగేవరకు ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఫైనల్ గా వీరి పెళ్లి ఫొటో బయటకొచ్చింది. ఇది చూసిన అభిమానులు రణబీర్-అలియాలకు శుభాకంక్షాలు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నిన్నటి నుంచే ఈ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముందుగా పితృ పూజ చేశారు. 

ఆ తరువాత మెహందీ ఫంక్షన్ ను నిర్వహించారు. ఇక పెళ్లిలో తన భార్యకు రణబీర్ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. 8 వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్ ను ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం. పెళ్లిలో అలియా ఈ బ్యాండ్ ను ధరించినట్లు తెలుస్తోంది. సబ్యసాచి రూపొందించిన పెళ్లి దుస్తులను ఈ జంట ధరించింది. మొత్తానికి ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైంది. 

ఇక వీరిద్దరూ కలిసి 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో నటించారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, డింపుల్‌ కపాడియా కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. రణ్‌బీర్, ఆలియా వివాహం సందర్భంగా 'బ్రహ్మాస్త్ర' తొలి భాగం నుంచి 'కేసరియా' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. 

Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?

Also Read: రాజమౌళి, నాగ చైతన్య వాడే ఈ కారు ప్రత్యేకతలు తెలుసా? ఆస్తులు అమ్మినా దీన్ని కొనలేం!

View this post on Instagram
 
A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

Published at : 14 Apr 2022 07:35 PM (IST) Tags: alia bhatt Ranbir Kapoor Ranbir Alia Wedding Ranbir Alia Wedding photo

సంబంధిత కథనాలు

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!

Anchor Shiva: ‘డ్రైవర్’ శివ, యాంకర్ అయ్యాడు, సామాన్యుడిగా ‘బిగ్ బాస్’కి వచ్చి, టాప్‌లో నిలిచాడు

Anchor Shiva: ‘డ్రైవర్’ శివ, యాంకర్ అయ్యాడు, సామాన్యుడిగా ‘బిగ్ బాస్’కి వచ్చి, టాప్‌లో నిలిచాడు

Bigg Boss OTT Finale: శివ జర్నీకి ఎండ్ కార్డ్ - టాప్ 2 లో ఆ ఇద్దరే!

Bigg Boss OTT Finale: శివ జర్నీకి ఎండ్ కార్డ్ - టాప్ 2 లో ఆ ఇద్దరే!

Bigg Boss OTT Finale: క్యాష్‌‌తో అరియానా ఔట్, దొంగ సచ్చినోళ్లంటూ అనిల్, సునీల్‌పై ఆగ్రహం

Bigg Boss OTT Finale: క్యాష్‌‌తో అరియానా ఔట్, దొంగ సచ్చినోళ్లంటూ అనిల్, సునీల్‌పై ఆగ్రహం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్

Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్

Live with Leopards: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Live with Leopards: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!