By: ABP Desam | Updated at : 13 Apr 2022 03:20 PM (IST)
'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' సినిమా బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత వారం రోజులుగా చెన్నై లాంటి సిటీల్లో 'బీస్ట్' సినిమా రిలీజ్ రచ్చ మాములుగా లేదు. థియేటర్ల ముందు విజయ్ ఫ్యాన్స్ హంగామా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు ఉదయం నుంచి థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, బాణాసంచాలు పేలుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
'బీస్ట్' సినిమాను చూడడానికి థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. ఫస్ట్ షో చూసిన వారికి విరుద్ నగర్‌లోని రాజా లక్ష్మీ, అమ్రితారాజ్ థియేటర్లు ఒక లీటరు పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. అయితే దీనికొక కండీషన్ పెట్టారు. అదేంటంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎవరైతే 5 టికెట్లు కొంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ థియేటర్లలో ఫస్ట్ షోను ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రదర్శించారు.
ఇది కాకుండా.. చెన్నైలోని పలు చోట్ల విజయ్ అభిమానులు సైతం ప్రేక్షకులకు లీటర్ పెట్రోల్ ని ఫ్రీగా ఇచ్చారు. మక్కళ్ ఇయ్యక్కం తరపున అభిమానులంతా బీస్ట్ సినిమా చూసిన ప్రేక్షకులు లీటర్ పెట్రోల్‌ను ఫ్రీగా అందిస్తున్నారు. ఈ సినిమాను చూడడానికి కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఈరోజు సెలవు ప్రకటించాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు
Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
RamaRao On Duty Postponed: రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్, 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా
Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
3 Years of YSR Congress Party Rule : పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా మారిన సచివాలయ వ్యవస్థ ! మేలు జరుగుతుందా ? కీడు చేస్తుందా ?
Male Fertility: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది