అన్వేషించండి

Appudo Ippudo Eppudo Teaser: అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే - నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ చూశారా?

నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ టీజర్ ను విడుదల చేశారు.

Appudo Ippudo Eppudo Teaser Release: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, దర్శకుడు సుధీర్ వర్మ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రంగా వస్తోంది ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ. ఇప్పటికే వీరిద్దరు కలిసి చేసిన ‘స్వామి రారా‘, ‘కేశవ‘ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో లేటెస్ట్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

లవ్ స్టోరీ..  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్..

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ మరో అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. దసరా కానుగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లుగానే సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే... హీరో నిఖిల్ రేసర్ గా కనిపించబోతున్నాడు. వైవా హర్ష కామెడీతో అలరించనున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రేమ కథతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణాంత పనులను జరుపుకుంటోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 

దీపావళికి ప్రేక్షకుల ముందుకు..

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలో రుక్మిణి వసంత్, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర సంస్థ నిర్మిస్తున్నది. కార్తీక్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నవంబర్ 8న సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు.

‘స్వయంభు’ సెట్స్ లో ఆయుధపూజ

అటు నిఖిల్ హీరోగా 'స్వయంభు' చిత్రం కూడా తెరకెక్కుతోంది. భరత్​ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోంది. విజయదశమి సందర్భంగా ‘స్వయంభు’ సెట్‌ లో ఆయుధ పూజ చేశారు. సినిమా కోసం ఉపయోగిస్తున్న ఆయుధాలు అన్నింటికీ పూజ చేశారు. ఈ చిత్రంలో నిఖిల్‌ ఓ యోధుడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. నభా నటేష్ సైతం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతమందిస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.   

Also Read'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Hrithik Roshan : హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
Venky Anil 5 : అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Bandla Ganesh : అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget