'కార్తికేయ 2', '18 పేజెస్' విజయాల తర్వాత 'స్పై'తో నిఖిల్ వస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? నిఖిల్ టార్గెట్ ఎంత?

నైజాంలో రూ. 5 కోట్లకు 'స్పై' రైట్స్ అమ్మేశారు. 

ఆంధ్రాలో అన్ని ఏరియాల బిజినెస్ రూ. 6 కోట్ల రేషియోలో విక్రయించారు. 

సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా 'స్పై'కు 2 కోట్లు వచ్చాయి. 

ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల్లో సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా రూ. 13 కోట్లు వచ్చాయి.

ఓవర్సీస్ రైట్స్ రూ. 1.80 కోట్లకు, కర్ణాటకతో పాటు రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 70 లక్షలకు అమ్మారు. 

'కార్తికేయ 2' హిట్ నేపథ్యంలో ఇతర భాషల రైట్స్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయట.

టోటల్ థియేట్రికల్ బిజినెస్ రూ. 17.50 కోట్లకు జరిగిందట. ఇప్పుడు నిఖిల్ ముందు ఉన్న టార్గెట్ రూ. 19 కోట్లు!

రూ. 40 కోట్లు ఇచ్చి అమెజాన్, స్టార్ నెట్వర్క్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ తీసుకున్నాయి.

నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా నిఖిల్ 'స్పై' లాభపడింది. దాంతో బడ్జెట్ రికవరీ కావడమే కాదు, నిర్మాతలు లాభాల్లోకి వెళ్లారు. 

'స్పై' సినిమాతో ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.