సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చి.. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది యాంకర్ సౌమ్యా రావు. మాతృభాష కన్నడే అయినా.. తెలుగులో చక్కగా మాట్లాడుతూ అందరి మన్ననలూ పొందుతోంది. రష్మీ, అనసూయల స్థానాలను భర్తీ చేయడంతో తక్కువ సమయంలోనే ఎనలేని పాపులారిటీ తెచ్చుకున్న సౌమ్యా రావు. ‘జబర్దస్త్’తో గుర్తింపు రావడంతో సౌమ్యా రావు ఆ గ్లామర్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. 'తేరే వస్తే ఫలక్ తక్ చంద్ లావు గా' అంటూ రీసెంట్ గా నీలి రంగు చీరలో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇలా లేటెస్ట్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ వైరల్ కావడం సౌమ్యా రావు తన ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. Image Credits: Sowmya Rao/Instagram