Andhra King Taluka First Single: హీరో రామ్ రాసిన లవ్ సాంగ్ - 'ఆంధ్రా కింగ్ తాలూకా' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
Nuvvunte Chaley: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు స్వయంగా రామ్ లిరిక్స్ రాశారు.

Ram Pothineni's Nuvvunte Chaley Song Released: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తనలో మరో టాలెంట్‌ను పరిచయం చేశారు. తన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో లవ్ సాంగ్‌కు లిరిక్స్ రాశారు. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
స్లో మోషన్... లవ్ ఫీలింగ్
'ఒక చూపుతో నాలోనే పుట్టిందే... ఎదో వింతగా గుండెలో చేరిందే...' అంటూ స్లో మోషన్‌లో లవ్ ఫీలింగ్‌తో సాగే సాంగ్ ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడిన పాటకు వివేక్, మెర్విన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రామ్ ఉపేంద్ర వీరాభిమానిగా కనిపించనున్నారు. ఈ మూవీకి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా... రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Come, join our Sagar’s love journey with Mahalaxmi ❤️#NuvvunteChaley from #AndhraKingTaluka is out now ✨️
— Mythri Movie Makers (@MythriOfficial) July 18, 2025
▶️ https://t.co/RyAgBAGpNP
Lyrics by Energetic Star @ramsayz ✍️
Music by the dynamic duo @iamviveksiva & @mervinjsolomon 🎶
Sung by Rockstar @anirudhofficial 🎙️… pic.twitter.com/Gf5hA64e9a
Also Read: 'కింగ్‌డమ్' మూవీ కోసం విజయ్ దేవరకొండ స్టంట్స్! - వైరల్ వీడియోపై ఫుల్ క్లారిటీ
ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. రామ్, భాగ్యశ్రీతో పాటు ఉపేంద్ర, రావు రమేష్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హీరో ఫ్యాన్ మధ్య ఏం జరిగింది?
ఈ మూవీలో హీరో రామ్ సాగర్ రోల్‌లో నటిస్తుండగా... ఆయన సరసన మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సినిమాలో మూవీ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు. ఓ ఫ్యాన్‌కు, హీరోకు మధ్య జరిగే కొన్ని ఆసక్తికర ఘటనల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు ఓ అందమైన లవ్ స్టోరీ కూడా ఉండనుంది. గత కొంతకాలంగా రామ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత అంతటి స్థాయిలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా... ఈ మూవీతోనైనా మంచి హిట్ కొట్టాలని రామ్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.




















