Vijay Deverakonda: 'కింగ్‌డమ్' మూవీ కోసం విజయ్ దేవరకొండ స్టంట్స్! - వైరల్ వీడియోపై ఫుల్ క్లారిటీ
Vijay Deverakonda Stunt: 'కింగ్‌డమ్' మూవీ కోసం విజయ్ దేవరకొండ గట్టిగానే శ్రమించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇది మార్ఫ్‌డ్ వీడియో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Fact Check On Vijay Deverakonda Stunt Viral Video: యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన 'స్పై'గా కనిపించనున్నారు. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని మాస్ లుక్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుండగా... టీజర్, వీడియోస్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
స్టంట్ వీడియో వైరల్
'కింగ్‌డమ్' మూవీ కోసం విజయ్ దేవరకొండ చాలా హార్డ్ వర్క్ చేశారు. మాస్, యాక్షన్ సీక్వెన్స్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. మూవీలో వార్ సీక్వెన్స్, రోల్‌కు తగిన ఇంటెన్సిటీ, ఫిజికల్ ప్రెసెన్స్ కోసం స్పెషల్ కేరింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. మూవీ కోసం విజయ్ ఓ డేంజరస్ స్టంట్ వేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
చేతుల సాయం లేకుండా రెండు గోడల మధ్య కాళ్ల సపోర్ట్‌తోనే 12 అడుగుల పైకెక్కడం వీడియోలో కనిపించింది. దీన్ని ఆయన ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ మూవీ కోసం విజయ్ ఎంత కష్టపడ్డారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన డెడికేషన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
Tom cruise Tarwata alanti risky Stunts chesindi Nuvve anna @TheDeverakonda 🙏🏻
— विनीतᴾᵃʳᵃᵈⁱˢᵉ (@Viinethere) July 17, 2025
Actor
Producer
Dancer
Tents maker
Performer
Singer
Stunts Master
A Complete Actor and All Rounder in India right now 👍🏻👍🏻
The name is Vijay Konda 💥💥pic.twitter.com/Nle9xVB9tl
అసలు నిజం ఏంటంటే?
అయితే, అసలు ఆ వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ కాదని... ఎవరో ఓ వ్యక్తి చేసిన స్టంట్‌ను మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు వీడియోను షేర్ చేస్తున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు.
View this post on Instagram
ఈ మూవీకి 'మళ్లీ రావా', 'జెర్సీ' సినిమాల ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా... విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థల బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ నెల 31న పాన్ ఇండియా స్థాయిలో మూవీని రిలీజ్ చేయనున్నారు.
ఇటీవల విజయ్ దేవరకొండ ఖాతాలో సరైన హిట్ పడలేదు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి మూవీస్ అనుకున్నంత సక్సెస్ కాలేదు. 'కింగ్ డమ్' మూవీ ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని... యాక్షన్ సీక్వెన్స్, మాస్ లుక్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్ అంటున్నారు.





















