Akshay Kumar: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మంచి మనసు - స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్
Akshay Kumar Help: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్టంట్ వర్కర్స్‌కు అండగా నిలిచారు. దేశంలోని 650 మంది స్టంట్ వర్కర్లకు ఆరోగ్య, ప్రమాద బీమా వర్తించేలా ఇన్సూరెన్స్ చేయించారు.

Akshay Kumar Helped To Stunt Workers: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల షూటింగ్ సెట్‌లో ఊహించని ప్రమాదంలో స్టంట్ మ్యాన్ రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విని చలించిపోయిన అక్షయ్... ఇండస్ట్రీలో 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు.
ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఆరోగ్యం, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్ మ్యాన్ సెట్‌లో కానీ బయట కానీ ఎక్కడైనా గాయపడితే రూ.5 లక్షల వరకూ బీమా పొందవచ్చు. దీంతో అక్షయ్‌పై స్టంట్ వర్కర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు. అక్షయ్ చేసిన సహాయంపై బాలీవుడ్ ఫేమస్ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ రియాక్ట్ అయ్యారు. 'మీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన ఈ సహాయం వల్ల బాలీవుడ్‌లో దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్ మ్యాన్‌లు, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు.' అంటూ థాంక్స్ చెప్పారు.
అసలేం జరిగిందంటే?
ఇటీవలే కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం జరిగింది. ఆర్య హీరోగా, డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న 'వేట్టువం' షూటింగ్ సెట్‌లో తాజాగా ఓ ప్రమాదం జరిగింది. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా... స్టంట్ మ్యాన్ రాజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన అత్యంత బాధాకరమని... రాజు మరణ వార్తతో తాను చలించిపోయినట్లు అక్షయ్ కుమార్ తెలిపారు.
సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం స్టంట్ కార్మికులు తమ ప్రాణాల పణంగా పెట్టాల్సి వస్తుందని అక్షయ్ అన్నారు. వారి శ్రమ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 'ఒక్కోసారి షూటింగ్ టైంలో స్టంట్ చేసే వారికి ఊహించని ప్రమాదం జరిగితే వారి కుటుంబం రోడ్డున పడుతుంది. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువ. ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు. వీరు వైద్య బీమాను భరించలేదు. దేశంలోని 650 మంది స్టంట్ వర్కర్ల ఆరోగ్య బీమాను చెల్లించాలని నిర్ణయించుకున్నా.' అని తెలిపారు.
Also Read: 'కింగ్‌డమ్' మూవీ కోసం విజయ్ దేవరకొండ స్టంట్స్! - వైరల్ వీడియోపై ఫుల్ క్లారిటీ





















