Arya 20 Years Celebrations: 'గంగోత్రి' హిట్, కానీ అందంగా లేనని ఆఫర్స్ రాలేదు - ఏడాది పాటు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో తిరిగే వాడిని
Allu Arjun: ఆర్య 20 ఏళ్ల సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. ఏడాది పాటు సినిమాలు లేకుండ ఖాళీ తిరుగుతున్న తనకు ఆర్య సింగిల్ మూమేంట్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిందన్నారు.
Allu Arjun Comments at Arya 20 years celebrations: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా 'గంగోత్రి'. ఈ మూవీ బ్లాక్‌బస్టర్. కానీ హీరోగా అల్లు అర్జున్‌కి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం 'ఆర్య' అనడంతో సందేహం లేదు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అను మెహతా హీరోయిన్‌గా శివ బలాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అప్పట్లొ 125 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ సినిమా విడుదలై నిన్నటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం 'ఆర్య' 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, 'దిల్' రాజు, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్య మూవీ అంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే సింగిల్ మూమేంట్‌లో నా జీవితాన్ని మార్చేసిన అతిపెద్ద సినిమా ఇది అన్నారు. "గంగోత్రి సినిమా చేశాను. ఈ మూవీ సూపర్ హిట్. నా నేను అందంగా లేనని, స్క్రిన్ ప్రజెన్స్ బాగా లేదని నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కథలు వింటున్నాను కానీ, నాకు నచ్చడం లేదు. ఏడాది పాటు ఖాళీగా ఉన్నాను. రోజుకు మూడు కథలు వింటున్నా. ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లి సినిమాలు చూస్తున్నా ఏడాది పాటు పనిపాట లేకుండ పిచ్చివాడిలా తీరుగుతున్నా. అదే టైంలో దిల్ రాజు గారి 'దిల్' సినిమా వచ్చింది. ఆ సినిమా చూశాను.
కానీ తరుణ్ కాల్ చేసి దిల్ రాజు గారు స్పెషల్‌గా దిల్ మూవీ షో వేస్తున్నారు వస్తవా? అని అడిగారు. అప్పటికే ఆ సినిమా చూశాను కానీ, నాకు నచ్చింది వస్తాను అని చెప్పాను. ప్రసాద్ ల్యాబ్స్‌కి వెళ్లి సినిమా చూశాను. అక్కడ సుకుమార్ గారు నన్ను చూశారు. నా దగ్గరికి వచ్చి నాతో సినిమా చేస్తానని, కథ చెప్పారు. ఇంకా కథ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అంతకు ముందు ఇడియట్ సినిమా చూసి ఇలాంటి యూత్ మూవీ నాకు వస్తుందా? అని అనుకున్నారు. ఇది ఇడియట్ కథ కాకపోయినా.. ఇది నా ఇడియట్ మూవీ అనుకున్నాను. అప్పుడు అందరు కొత్తవారే. దిల్ రాజు గారు అప్పుడే ఓ సినిమా చేశారు. అప్పుడప్పుడే ఆయనకు గుర్తింపు వస్తుంది. సుకుమార్ గారు కొత్త డైరెక్టరే. నేను కొత్తవాడినే. నన్ను నమ్మి సినిమా హిట్ కొడతారు అనే నమ్మకం లేదు. కథ మాత్రం చాలా బాగుంది.
కాని మమ్మల్ని నమ్మి సినిమా చేసేందుకు మా డాడీ, నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశం లేదు. కథ అన్ని బాగున్నా సుకుమార్ గారు ఆ రేంజ్‌లో డెలివరి చేయగలరా? అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్. అప్పుడే వివి వినాయక్ గారు మా డాడి దగ్గరికి వచ్చి ఒకటే మాట చెప్పారు. మీరు సినిమా తీయండి, ఆ కుర్రాడు తీయగలడు. నన్ను నమ్మండి. మూవీ చేయండి అన్నారు. ఒకవేళ ఏదైనా సీన్ మీకు నచ్చకపోతే నేను వచ్చిన సినిమా చేస్తాను అని ఆ ఒక్క మాట చేప్పడంతో మా అందరిలో వెయ్యి ఏనుగుల ధైర్యం వచ్చింది. ఈ విషయంలో వివి వినాయక్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా" అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు.