Actress Madhavi Reddy: రోజా నా క్లాస్‌మేట్ , అప్పుడు నల్లగా ఉండేది - పనిమనిషిగా బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లం.. నటి షాకింగ్ కామెంట్స్
ఆర్కే రోజాపై నటి మాధవి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. రోజా తన క్లాస్‌మేట్ అని కాలేజ్ టైంలో నల్లగా ఉండేదన్నారు. అందుకే పనిమనిషి పాత్రకు బాగా సెట్ అయ్యావంటూ ఏడిపించేవాళ్లమంటూ చెప్పుకొచ్చింది.
Actress Madhavi Reddy About Rk Roja: ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్ర పోషించిన ఒక్క సీన్‌లో గుర్తింపు పొందినవారు ఎంతోమంది ఉన్నారు. అలా నాగార్జున రాజన్న సినిమాతో గుర్తింపు పొందిన నటి మాధవి. సినిమాల్లో, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా రాజన్న సినిమా ఆఫర్ గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు నాగార్జున మేనకోడలు సుప్రియ తనని సెలక్ట్ చేసిందని, మూవీకి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్ని వారే సెలక్ట్ చేశారని చెప్పారు.
ఇక ఓ గూడెం బ్యాగ్రౌండ్‌లో సినిమా ఉంటుందని, ఆ గూడెంకు చెందని మహిళాలో ఓ కీ రోల్ పోషించానని చెప్పారు. ఈ మూవీ టైంలో తనకి ఒకటిన్నర పేజీ డైలాగ్ ఇచ్చారని, అది ఒకే షాట్ చెప్పానన్నారు.డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నానని పేర్కొంది. అయితే తన వాయిస్, సింగిల్ షాట్ డైలాగ్ చెప్పడం చూసి బాహుబలి రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారని, 'చాలా బాగా చెప్పావమ్మా.. మీ వాయిస్ చాలా బాగుంది' అని ప్రశంసించారని చెప్పింది. ఆ తర్వాత తన బాల్యం, చదువు గురించి చెప్పారు. తన ఫ్యామిలీ తిరుపతిలో ఉండేవాళ్లమని, తన స్కూలింగ్, కాలేజ్ అంతా తిరుపతిలో అని చెప్పారు. సినీ నటి, ఏపీ మినిస్టర్ ఆర్కే రోజా తన క్లాస్‌మేట్ అని చెప్పారు.
కాలేజీలో చాలా సైలెంట్
బిఎస్సీ హోంసైన్స్‌లో రోజా తను తన క్లాస్‌మేట్స్ అని చెప్పింది. "బిఎస్సీ హోంసైన్స్ చదివేటప్పుడు డ్యాన్స్ క్లాసెస్‌కి కూడా వెళ్లేవాళ్లం. అప్పుడే రోజాకు శివప్రసాద్ గారు తీసిన 'ప్రేమ తపస్సు' సినిమా చాన్స్ వచ్చింది. అదే తన ఫస్ట్ మూవీ. అప్పుడు మేం డిగ్రీలో ఉన్నాం. ఈ సినిమాలో రోజాది పనిమనిషి క్యారెక్టర్. అప్పుడు ఆమె చాలా నల్లగా ఉండేది. దీంతో రోజాను హేళన చేశాం. నువ్వు నల్లగా ఉంటావు కదా నీకు సూట్ అయ్యే క్యారెక్టర్ వచ్చింది. పనిమనిషి పాత్ర నీకు బాగా సెట్ అయ్యింది" అని ఆమెను అంతా ఏడిపించేవాళ్లం అని అన్నారు. అయితే చదువులో రోజా చాలా ఇంటలిజెంట్ అని, చాలా సైలెంట్‌గా ఉండేవారంది. పనిమనిషి పాత్ర అనే రోజాను సినిమాల్లో తీసుకున్నారు. ఎందుకుంటే ఆ పాత్ర నల్లగా ఉండాలి కదా. అందుకే తనని తీసుకున్నారు. ఆ తర్వాత చామంతి వంటి సినిమాలు చేసింది. తమిళంలో చేసిన సినిమాలకు ఆమె బ్రేక్ ఇచ్చాయి. పైగా తను చాలా టాలెంటెడ్ అండ్ ఇంటలిజెంట్ కాబట్టి తక్కువ టైంలో హీరోయిన్‌గా మారారు" అని పేర్కొంది. ఆ చాలా రోజుల తర్వాత మా టీవీలో వచ్చే మోడ్రన్ మహాలక్ష్మి షోలో తనని కలిశానని, అప్పుడు ఇలా నేను మీ క్లాస్‌మేట్ అని పరిచయం చేసుకున్నానంది. అయితే అంత గుర్తుపట్టలేదని, అప్పుడు చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని కదా, గుర్తుపట్టలేదన్నారని చెప్పారంటూ నటి మాధవి రోజా గురించి చెప్పుకొచ్చారు.
Also Read: విడాకులపై శ్రీజ కొణిదెలకు నెటిజన్ ప్రశ్న - మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అతనితో కలిసి ఉంటారా?