అన్వేషించండి

Sreeja Konidela: విడాకులపై శ్రీజ కొణిదెలకు నెటిజన్ ప్రశ్న - మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అతనితో కలిసి ఉంటారా?

Sreeja Konidela: 2016లో కళ్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకుంది శ్రీజ కొణిదెల. కానీ చాలాకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతుండగా తాజాగా శ్రీజ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Sreeja Konidela About Divorce: సినీ సెలబ్రిటీల్లో పెళ్లి, విడాకులు చాలా కామన్ అని అంటుంటారు. అసలు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే.. సినీ సెలబ్రిటీల్లో విడాకులు తీసుకునేవారి సంఖ్య నిజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీలోని అమ్మాయిలు కూడా విడాకులు తీసుకునే విషయంలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటారు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కొణిదెల విడాకుల గురించి కూడా చాలాకాలం పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడిచింది. కానీ తను మాత్రం దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా విడాకులకు సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసి అందరికీ షాకిచ్చింది శ్రీజ.

స్పందన లేదు..

2016లో కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని శ్రీజ పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు కళ్యాణ్ దేవ్ ఏం చేస్తుండేవాడో తెలియదు కానీ శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లకు పెళ్లయిన రెండేళ్ల తర్వాత.. అంటే 2018లో వీరిద్దరికీ ఒక కూతురు జన్మించింది. అంతా బాగానే ఉన్నట్టు అనిపించేలోపే శ్రీజ, కళ్యాణ్ దేవ్ కలిసి కనిపించడం మానేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో కూడా వీరు కలిసి కనిపించడం లేదు. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్క ఈవెంట్‌లో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించడం లేదు. దీంతో శ్రీజ విడాకులు తీసుకుంది అంటూ వార్తలు వైరల్ అవ్వడం మొదలయ్యింది. కానీ దీని గురించి శ్రీజ ఎప్పుడూ స్పందించలేదు.

స్టోరీలో షేర్..

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే శ్రీజ.. తాజాగా విడాకులకు సంబంధించిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది. ఒక పబ్లిక్ పేజ్‌లో విడాకుల గురించి అడిగిన ప్రశ్నను శ్రీజ తన స్టోరీలో పోస్ట్ చేసింది. ‘‘నాకు విడాకులు కావాలి. కానీ నా భర్త మాత్రం.. నేను తనను ప్రేమిస్తే, కేర్ చేస్తే ఇంకొన్నాళ్లు ప్రయత్నించి చూడమంటున్నాడు. ఏమంటారు?’’ అని ఒక మహిళ అడిగింది. ఇందుకు ఆమె బదులిస్తూ.. ‘‘మీరు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అతనితో కలిసి ఉంటారా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి’’ అని ఆ పబ్లిక్ పేజ్ సమాధానమిచ్చింది.

Sreeja Konidela: విడాకులపై శ్రీజ కొణిదెలకు నెటిజన్ ప్రశ్న - మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే అతనితో కలిసి ఉంటారా?

సెల్ఫ్ లవ్ కావాలా?

‘బబుల్ బాత్ చేయడం, స్పాకు వెళ్లడం, మంచిగా డ్రెస్ చేసుకోవడం, మీకు మీరే ఒక గిఫ్ట్ తెచ్చుకోవడం.. ఇదంతా సెల్ఫ్ లవ్ అని అనుకునేవారికి చెప్తున్నాను. ఒకసారి మళ్లీ ఆలోచించండి. సెల్ఫ్ కేర్ కావాలి? సెల్ఫ్ లవ్ కావాలా? అసలు మనకు మనల్ని ప్రేమించుకునే ధైర్యం ఉందా?’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా విడాకుల గురించి మాట్లాడుతున్న వారందరికీ కౌంటర్ ఇచ్చింది శ్రీజ కొణిదెల. కళ్యాణ్ దేవ్‌తో విడాకుల గురించి తను ప్రత్యక్షంగా స్పందించకపోయినా.. ఇలా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా పలుమార్లు పరోక్షంగా స్పందించింది శ్రీజ. సెల్ఫ్ లవ్ అనేది ఎంత ముఖ్యం అని చాలాకాలంగా చెప్తూనే ఉంది. దీంతో శ్రీజ విడాకుల గురించి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: అది నాకు కష్టమైన నిర్ణయం, కానీ వదులుకోక తప్పదని అర్థమయ్యింది - రాజమౌళి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget