అన్వేషించండి

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర

మూసీ ప్రక్షాళన రాజకీయల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ విసిరిన సవాల్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

Tourism Minister Kishan Reddy Comments On Muse Renaissance Project : మూసీ ప్రక్షాళన రాజకీయం మరోసారి హీటెక్కింది. నిర్వాసిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ నిద్ర చేశారు. అనంతరం రేవంత్ సర్కారుపై విమర్శలు చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో రియాక్షన్ కూడా వచ్చింది. ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మూసీ నది విషతుల్యమైపోయిందని అక్కడ ఒక ఆరు నెలలపాటు సామాన్య ప్రజల్లో నివసిస్తే కచ్చితంగా ప్రక్షాళన ఆపేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి తరచూ సవాళ్లు చేస్తున్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఏకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ నిద్రపేరుతో అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని తలసీరామ్ నగర్‌లో బస్తీ వాసులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. 

రాత్రంతా అక్కడ పడుకున్న కిషన్ రెడ్డి ఉదయాన్నే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పొత్తుల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏ పార్టీతో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీఆర్‌ఎస్‌తో పొత్తుల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్‌తో కలిసి బీజేపీ నేతలు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు తిప్పికొట్టారు. అసలు బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ఇప్పడు కూడా చాలా మంది ఆ గులాబీ నేతలు కాంగ్రెస్‌లో చేరారని గుర్తు చేశారు. బీజేపీ మాత్రం బీఆర్‌ఎస్‌తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తేల్చి చెప్పారు.  

ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు అంశమే ప్రస్తావనకు రాలేదని అసలు అలాంటి ఆలోచనే లేదన్నారు కిషన్ రెడ్డి. భవిష్యత్‌లో కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండబోదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేసిందని అందుకే ఇద్దరి డీఎన్‌ఏలు ఒకటే అని విమర్శించారు కిషన్ రెడ్డి. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన రెండు పార్టీలకూ లేదని విమర్శించారు. 

సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను తాము స్వీకరించామని మూసీ పరిసర ప్రాంతాల్లోని బస్తీల్లో తమ నేతలంతా నిద్ర చేశారని అన్నారు. తులసీరామ్‌ నగర్‌లో కిషన్ రెడ్డి, మలక్‌పేట్‌లో లక్ష్మణ్‌, ఎల్‌బీ నగర్‌లో ఈటల రాజేందర్, హైదర్ షా కోట్‌లో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, కార్వాన్‌లో సీతారాం నాయక్, రామాంత‌పూర్‌లో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే మూసీ ప్రక్షాళన ఆపేయాలన్నారు. పేదల ఇళ్లు కూల్చకుండా కూడా నదిని ప్రక్షాళ చేయవచ్చని సూచించారు. ఒక రిటైనింగ్ వాల్ నిర్మిస్తే చాలా వరకు పరిస్థితిలో మార్పు వస్తుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. పనులను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో వేల ప్రార్థనామందిరాలు, ఆలయాలతోపాటు పేదల ఇళ్లు కూల్చివేతను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు కిషన్ రెడ్డి. 

Also Read: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. సకర సౌకర్యాలతో ఒకరు రోజు నిద్ర చేయడం కాదని మూడు నెలలు అక్కడ జీవనం సాగించాలని అన్నారు. అప్పుడే అసలు అక్కడ ప్రజలు పడుతున్న బాధలు తెలుస్తాయన్నారు. ఆరు నెలలు ఉండాలని సీఎం చెప్పారని ఒకరు నిద్ర చేసి సవాల్ స్వీకరించామంటే ఎలా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇలా కలిసి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. 

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగ నిద్రలతో బీజేపీ నేతలు ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన ఆపాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా మూసీ కంపులో బతకాలని ఆకాంక్షిస్తున్నరాని ధ్వజమెత్తారు. 

మొత్తానికి బస్తీ నిద్రతో సైలెంట్‌గా ఉన్న మూసీ ప్రక్షాళన మరోసారి తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులు బీఆర్‌ఎస్ నేతలు బాధితులను కలుస్తూ వారి పక్షాన మాట్లాడారు. ఇప్పుడు సీన్‌లోకి బీజేపీ నేతలు వచ్చారు. ఇన్ని రోజులు ఒకరిద్దరు మూసీ అంశంపై మాట్లాడుతున్నా పెద్దగా ఫోకస్ రాలేదు. ఇప్పుడు బస్తీ నిద్రతో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. 

Also Read: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget