అన్వేషించండి

Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

Hyderabad News: ప్రముఖ నటి కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తమిళనాడు పోలీసులు ఎట్టకేలకు ఆమెను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Actress Kasthuri Arrested In Hyderabad: ప్రముఖ సినీ నటి కస్తూరి (Actress Kasthuri) శనివారం అరెస్టయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు (Chennai Police) ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు ఇటీవల పోయెస్ గార్డెన్‌లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటికి తాళం వేసి ఉండడంతో సహా ఫోన్ స్విచ్చాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు తెలిపారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నట్లు తెలుసుకున్న చెన్నై పోలీసులు అక్కడకు వచ్చి అరెస్ట్ చేశారు.

ఇదీ జరిగింది

కాగా, నటి కస్తూరి ఇటీవల తెలుగు వారిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలనే డిమాండ్‌తో ఈ నెల 4న చెన్నైలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మా‌ట్లాడిన ఆమె తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతఃపురంలో సేవ చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు ఇప్పుడు తామే అసలైన తమిళులం అనేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగు మాట్లాడే వాళ్లకే మంత్రి పదవులు ఇస్తున్నారని అసలైన తమిళులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.

ఈ క్రమంలో కస్తూరి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. తాను కొందరి గురించే మాట్లాడినట్టు వివరణ ఇచ్చారు. తెలుగు స్నేహితులు ఒకరు తనకు పరిణామాలు వివరించారని పూర్తి విషయం తెలుసుకున్న తర్వాత ఇలా స్పందిస్తున్నట్టు వెల్లడించారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వంపై తనకు చాలా గౌరవం ఉందని.. తాను జాతి ప్రాంతాలకు అతీతంగా ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు వారితో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. కొందరి గురించి చేసిన కామెంట్స్‌ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఎవరీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని బ్రాహ్మణుల పోరాటంలో పాలు పంచుకోవాలని తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేసులు నమోదు కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

Also Read: Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget