సఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్
టీమిండియాకు ఆటడం మొదలు పెట్టి 9ఏళ్లు దాటి 10వ ఏడాది వచ్చేస్తోంది. కానీ పర్మినెంట్ ప్లేయర్ కాలేకపోయాడు. 30ఏళ్లు వయస్సు వచ్చేసింది. కుర్రాళ్ల నుంచి తీవ్రమైన పోటీ. ఇలాంటి టైమ్ లో తనకు వచ్చిన టీ20 అవకాశాన్ని రెండు చేతులతో పట్టుకున్నాడు సంజూ శాంసన్. ఐపీఎల్ లో కెప్టెన్ గా ఏళ్లుగా ఓ టీమ్ ను లీడ్ చేస్తున్నా జాతీయ జట్టులో తనకు చిక్కకుండా జారిపోతున్న అవకాశాలను రెండు చేతులతో అతి జాగ్రత్తగా పట్టుకుంటున్నాడిప్పుడు. ఓపెనర్ గా అవతారం మార్చినప్పటి నుంచి టీ20ల్లో టీమ్ ఏంటనేది చూడకుండా రెచ్చిపోతున్నాడు. అదే జోరులో సౌతాఫ్రికా మీద నాలుగో టీ20 లోనూ దుమ్మురేపాడు. సిరీస్ లో రెండో సెంచరీ బాదేసి సౌతాఫ్రికా గడ్డ మీద సౌతాఫ్రికా కు రెండు సార్లు సెంచరీ మోతను రుచి చూపించాడు. సంజూశాంసన్ కి ఇది ఐదు మ్యాచుల్లో మూడు సెంచరీ. బంగ్లా దేశ్ తో టీ20 సిరీస్ లాస్ట్ మ్యాచ్ తో సెంచరీ కొట్టి ఫామ్ లోకి వచ్చిన సంజూ భాయ్..నెల రోజుల గ్యాప్ తర్వాత జరిగిన సౌతాఫ్రికా టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ లోనూ సెంచరీ కొట్టాడు. అలా వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు క్రియేట్ చేసిన సంజూ ఆ తర్వాత రెండు మూడు టీ20ల్లో డకౌట్ అవ్వటం మళ్లీ విమర్శలకు దారి తీసింది. ఇన్ కన్సిస్టెంట్ అనీ అందుకే టీమ్ నుంచి సంజూను తీసేస్తున్నారని ఓసారి అద్భుతంగా ఆడటం..పది మ్యాచులు పడుకోవటం కామన్ అయిపోయిందని మెల్లగా విమర్శలు మొదలయ్యాయి. ఆ నోళ్లు అన్నీ మూయించేలా ఆఖరి టీ20 మ్యాచ్ లో విశ్వరూపం చూపించాడు శాంసన్. 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 పరుగులు బాది...సిరీస్ లో రెండో సెంచరీ, వరుసగా ఐదు మ్యాచుల్లో మూడో సెంచరీ బాది తన ఫామ్ గాలివాటం కాదని ప్రూవ్ చేశాడు. ఇక టీ20ల్లో సంజూ శాంసన్ ఓపెనెర్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు ఫ్యాన్స్. ఆ రకంగా వచ్చే టీ20 వరల్డ్ కప్ కూడా ఓపెనర్ గా ఆడే అవకాశం ఉందని ఇప్పటి నుంచే లెక్కలు వేసేస్తున్నారు.