Pushpa 2 Trailer Launch Highlights: పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్
Pushpa 2 Trailer Telugu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరుగుతోంది. ఆ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.
LIVE

Background
ఫస్ట్ టైమ్ పాట్నా వచ్చా... మీ ప్రేమ కోసం తగ్గుతా - అల్లు అర్జున్
బీహార్ ప్రజలు అందరికీ నా నమస్కారాలు అంటూ స్పీచ్ ప్రారంభించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... తొలిసారి బీహార్ వచ్చాయని, మీరు చూపిస్తున్న ప్రేమ - ఈ స్వాగతానికి ధన్యవాదాలు అని చెప్పారు. పుష్ప ఎప్పుడూ తగ్గడు, కానీ మీ ప్రేమకు ఈ రోజు తొలిసారి తగ్గుతాడని ఆయన చెప్పారు. పాట్నాకు ధన్యవాదాలు తెలిపారు. తన హిందీలో తప్పులు ఉంటే క్షమించమని కోరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఇప్పుడు వైల్డ్ ఫైర్. మూడేళ్ళుగా దేశమంతా 'పుష్ప 2' కోసం ఎదురు చూస్తుందంటే అది ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ వల్ల సాధ్యమైంది. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు, అభిమానుల వల్లే ఇదంతా సాధ్యమైంది. మా టీమ్ అందరికీ థాంక్స్. డిసెంబర్ 5న సినిమా వస్తుంది. అందరికీ సినిమా నచ్చుతుంది'' అని చెప్పారు. అభిమానులు డైలాగ్ చెప్పమని రిక్వెస్ట్ చేయగా... 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫ్లవర్ కాదు' అని చెప్పారు.
హిందీ మేనేజ్ చేశా... మా రెండేళ్ల కష్టం - రష్మిక మందన్నా
'పుష్ప 2' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రష్మిక హిందీలో మాట్లాడారు. స్పీచ్ అయ్యాక హిందీ బాగా మాట్లాడారని యాంకర్ అంటే మేనేజ్ చేశానని చెప్పారు. దానికి ముందు ఆయన ఏమన్నారంటే... ''ఇంత ప్రేమ అందించిన పాట్నా ప్రజలకు థాంక్స్. రెండు ఏళ్లుగా మీరంతా ఎంతో సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. మీ ఎదురు చూపులకు... మీరు ఊహించిన దానికి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పగలను. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డిసెంబర్ 5వ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.
అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు - అనిల్ తడానీ
హిందీలో 'పుష్ప 2'ను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తడానీ మాట్లాడుతూ... ''ఈ రోజు అల్లు అర్జున్ ఇక్కడ చరిత్ర సృష్టించారు. ఈ రోజు ఇక్కడకి ఇంత మంది రావడం ఇంతకు ముందు చూడలేదు. థియేటర్లలో కూడా ఇదే విధమైన స్పందన చూడాలని అనుకుంటున్నాను. నేను ఇలాంటి పెద్ద ఈవెంట్ చూడటం ఇదే మొదటిసారి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ రవి గారికి, నవీన్ గారికి, అల్లు అర్జున్ గారికి థాంక్స్'' అని చెప్పారు.
మా రాష్ట్రానికి అతిథిగా వస్తే ప్రేమ చూపిస్తాం - బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్
'పుష్ప 2' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి అతిథిగా వచ్చిన బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ మాట్లాడుతూ... ''ఈ వేడుక పాట్నాలో నిర్వహించడం నాకు ఎంత ఆనందంగా ఉంది. మా బీహార్ ప్రభుత్వం తరఫున, అలాగే మా సీఎం గారి తరపున 'పుష్ప 2' చిత్ర బృందానికి మా కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ ఇలా సక్సెస్ కావడానికి తోడ్పడిన పోలీసులు, అభిమానులకు థాంక్స్. వాళ్ళు అందరూ కళకు, కళాకారులకు మద్దతు ఇచ్చేవారు. ఎవరైనా మా రాష్ట్రానికి అతిథిగా వచ్చినప్పుడు మేము ప్రేమ, అనురాగం చూపించడంలో ముందు ఉంటాం'' అని చెప్పారు.
బన్నీకి ప్రతి రోజూ పుష్ప గురించే ఆలోచన...
అల్లు అర్జున్ ప్రతి రోజూ 'పుష్ప 2' గురించి ఆలోచిస్తారని, ఆయనతో వర్క్ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోల్లో ఆయన ఒకరు అని చెప్పారు నవీన్ యెర్నేని.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

