అన్వేషించండి

Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌

Manipur News: మణిపూర్‌ మరోసారి రగులుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. పరిస్థితి చేయిదాటిపోకుండా చాలా ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ ఆపేశారు. కర్ఫ్యూ అమలులో ఉంది.

Manipur Boils Again Internet Services Suspended: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మధ్య కిడ్నాప్ అయిన వ్యక్తులు విగత జీవులుగా కనిపించడంతో అక్కడ పరిస్థితి మరోసారి గతి తప్పింది. ఇది మరింతగా వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం నుంచి పరిస్థితి సీరియస్‌గా ఉండే జిల్లాల్లో ఇంటర్‌నెట్‌లు నిలిపేశారు. 

మణిపూర్‌లో నిరసనల దృష్ట్యా శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలు నిలిపేసింది. ఈ రూల్స్‌ రెండు రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. గత వారం జిరిబామ్‌లో ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు వ్యక్తులు తప్పిపోయారు. వారి మృతదేహాలు కనిపించాయి. 

దీంతో వారి వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిరసనలు చేపడుతున్నారు. వివిధ జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ముగ్గురు మణిపూర్ మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడికి యత్నించారు. మణిపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బిష్ణుపూర్, తౌబాల్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, కక్చింగ్, చురచంద్‌పూర్‌, కాంగ్‌పోక్పిలో ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. 

"ప్రస్తుతం ఆందోళనలతో ఉద్రిక్తంగా ఉన్న ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కక్చింగ్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి జిల్లాల పరిధిలో VSATలు, బ్రాడ్‌బ్యాండ్ (IILL & FTTH) VPN సేవలతో సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలు తాత్కాలికంగా నిపిసేం. 16-11-2024 సాయంత్రం 5:15 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. లీజు లైన్‌లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చాం " అని ఆదేశాల్లో ఉంది. 

అంతే కాకుండా శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిన ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. పరిస్థితి మరింత దారుణంగా ఇంఫాల్ లోయలో నిరవధిక కర్ఫ్యూ స్ట్రిక్ట్‌గా అమలు చేస్తున్నారు. ఇంఫాల్ లోయలోని ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్‌, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్ జిల్లాల్లో కూడా నిరవధిక కాలం పాటు కర్ఫ్యూ అమలులో ఉంది. 

వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ వాడారు. ఇంఫాల్‌లోని వివిధ ప్రాంతాలలో వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్‌లు ప్రయోగించారు. అప్పటి ప్రజాప్రతినిధుల ఇళ్లపైకి నిరసనకారులు దూసుకెళ్లారు. అక్కడ కొందరు విధ్వంసం సృష్టిస్తే మరికొందరు చేతికి దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. కొన్నింటినికి నిప్పుపెట్టారు. 

నిన్న ఉదయాన్నే ఇంఫాల్ వెస్ట్‌లో ఉండే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ లాంఫెల్ సనకీతెల్ నివాసంపై ఓ టీం దాడి చేసింది. ఆయనతో మాట్లాడింది. ఆందోళనకారులతో మాట్లాడిన ఆయన.. ముగ్గురి హత్యకు సంబంధించిన అంశాలు క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని వారికి మాట ఇచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు.

ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ ప్రాంతంలోని ఉన్న మరో మంత్రి ఎల్ సుసీంద్రో సింగ్ నివాసాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించారు. సుసీంద్రో సింగ్ నివాసంపై దాడికి యత్నించారు. ముందే పసిగట్టిన పోలీసులు వారిపై టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. 

ఇంఫాల్ వెస్ట్‌లోని సగోల్‌బంద్ ప్రాంతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేశారు. ఇంటి ఎదుట బైఠాయించి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహంతో బిజెపి ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. ఆస్తులకు నిప్పు పెట్టారు. 

Also Read: పవన్ ప్రచారంతో మహారాష్ట్ర బీజేపీలో జోష్ - తెలుగు నేతలు ఇంచార్జులుగా ఉన్న చోట హుషారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
TG Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
Lavanya and Raj Tarun case: లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మంత్రి - వడ్డీకి డబ్బులిచ్చారట - ఇంటిపైనే కన్ను ?
లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మంత్రి - వడ్డీకి డబ్బులిచ్చారట - ఇంటిపైనే కన్ను ?
Arvind Kejriwal: 'పుష్ప 2'లో సూసేకి పాటకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ డ్యాన్స్... ఇదీ ఐకాన్ స్టార్ రేంజ్
'పుష్ప 2'లో సూసేకి పాటకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ డ్యాన్స్... ఇదీ ఐకాన్ స్టార్ రేంజ్
Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం - సురక్షితంగా బయటపడ్డ నటుడు
తమిళ స్టార్ హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం - సురక్షితంగా బయటపడ్డ నటుడు
Embed widget