(Source: ECI/ABP News/ABP Majha)
Maharastra Elections: పవన్ ప్రచారంతో మహారాష్ట్ర బీజేపీలో జోష్ - తెలుగు నేతలు ఇంచార్జులుగా ఉన్న చోట హుషారు
BJP: మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం బీజేపీలో హుషారు నింపుతోంది. ఏపీ బీజేపీ నేతలు ఇంచార్జులుగా ఉన్న చోట్ల ప్రచారం చేస్తున్నారు.
Pawan Kalyan campaign in Maharashtra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజుల ప్రచారానికి వెళ్లారు. తొలి రోజు మూడు సభల్లో ప్రసంగించారు. తెలుగు మూలాలున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం ప్లాన్ చేశారు. ఆయా జిల్లాలకు ఎన్నికల ఇంచార్జులుగా తెలుగు రాష్ట్రాల నేతలనే నియమించారు. గత నెల రోజులుగా వారు అక్కడ పని చేసుకుంటున్నారు. నాందేడ్ కు విష్ణువర్ధన్ రెడ్డి.. మరఠ్వాడాకు మధుకర్ ఇంచార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇంచార్జులుగా ఉన్న చోటనే పవన్ ప్రచారం చేస్తున్నారు.
Also Read: ఇది శివాజీ పుట్టిన నేల మా సహనం పరీక్షించకండి- మహారాష్ట్ర వేదికగా పవన్ కల్యాణ్ హెచ్చరిక
ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏపీ బీజేపీ నేతలే స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలు కొద్దిగా మరాఠీతో పాటు తెలుగులోనే సాగాయి. పవన్ ప్రసంగాలకు అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
Warmly welcomed Shri @PawanKalyan Garu and Shri @satyakumar_y Garu at the helipad as they arrived to support the #Maharashtra elections.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 16, 2024
Their presence and dedication to the two-day campaign are truly inspiring and will energize the momentum for success.
Looking forward to… pic.twitter.com/gTVySlSXI2
పవన్ కల్యాణ్ సినిమాలు మరాఠీభాషలోనూ డబ్ అవుతాయి. తెలుగు మూలాలున్న ఓటర్లు ఉండటంతో సహజంగానే పవన్ కల్యాణ్ కు ఎక్కువ క్రేజ్ ఉంది. బహిరంగసభలకు జనం పోటెత్తారు. పవన్ సభలను సక్సెస్ చేసేందుకు.. బీజేపీ అగ్రనేతల సభలకు దీటుగా జన సమీకరణ చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగం వారిలో జోష్ నింపింది. మహారాష్ట్ర ప్రజలను తాను ఓటు అడగడానికి రాలేదని వారికి గౌరవం ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న జాతీయవాదానికి అనుగుణంగా పవన్ కల్యాణ్ ప్రసంగాలు సాగాయి.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా డేగ్లూర్ సభలో జనసేన అధ్యక్షులు, రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు.
— JanaSena Party (@JanaSenaParty) November 16, 2024
• నేను ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన నేల, ఎందరో సాధువులు నడిచిన నేల, మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి… pic.twitter.com/FsHBNkQBjN
పవన్ కల్యాణ్ మరో రోజు కూడా మహారాష్ట్రలో ప్రచారం చేస్తారు. పవన్ కల్యాణ్‌కు స్టార్ గా ఉన్న ఆదరణతో పాటు ఆయన సనాతన ధర్మం కోసం ఇటీవల చేసిన ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా లభించింది. మహారాష్ట్రలో పోలింగ్ ఇరవయ్యో తేదీన జరగనుంది.
Also Read: ఫైనల్ స్టేజ్‌కు మహారాష్ట్ర ఎన్నికల వార్ - తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ బలగం !